సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేటా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై స్పందించిన చిత్రబృందం సినిమా సంక్రాంతికి రావడం లేదని క్లారిటీ ఇచ్చింది.

రజినీకాంత్ నటించిన '2.0' సినిమా ఈ నెల 29న విడుదల కానుండడంతో అతి తక్కువ గ్యాప్ లో రజినీకాంత్ మరో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని భావిస్తోన్న చిత్రబృందం సంక్రాంతి తరువాత సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తమిళంలో సంక్రాంతి బరిలో అజిత్ 'విశ్వాసం', శింబు 'వందా రాజా వాదాన్ వరువేన్' లతో పాటు రజిని కూడా ఉంటారనుకుంటే ఇప్పుడు రజిని తప్పుకొని ఆ రెండు సినిమాలకు దారి ఇచ్చేశారు.