రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్.. 'పెట్టా'!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 7, Sep 2018, 6:48 PM IST
rajinikanth's next with karthik subbaraj titled petta
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి','కాలా' వంటి సినిమాల తరువాత మరో యువదర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి','కాలా' వంటి సినిమాల తరువాత మరో యువదర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నాడు. పిజ్జా సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్.. రజినీకాంత్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

తలైవా 165వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 'పెట్టా' అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో రజినీకాంత్ లుక్ సరికొత్తగా ఉండబోతుంది. మోషన్ పోస్టర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు దర్శకుడు. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, త్రిషా, సిమ్రాన్ వంటి తారలు కనిపించనున్నారు. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

loader