Asianet News TeluguAsianet News Telugu

కమల్ హాసన్ సాయంతో.. మణిరత్నంని భయపెట్టిన రజినీకాంత్..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తనతో కమల్ హాసన్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి చేసిన కొన్ని తుంటరి పనులు గురించి వెల్లడించారు తలైవా..? 

Rajinikanth Reveals How Kamal Haasan Helped Him Impress Mani Ratnam on Dalapathi Set JMS
Author
First Published Aug 24, 2024, 5:54 PM IST | Last Updated Aug 24, 2024, 5:54 PM IST

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. సౌత్ సినిమాలో స్టార్లు గావెలుగు వెలిగారు రజినీకాంత్, కమల్ హాసన్.. 70 ఏళ్ళు దాటినా కాని.. ఇప్పటికీ అదే స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నారు ఈ హీరోలు. ఇండయాలోనే గొప్ప నటులుగా గుర్తింపు పొందిన వీరి అనుబంధం.. దాదాపు 40 ఏళ్ళుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోంది. అయితే వీరి మధ్య కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా జరిగాయట. అంతే కాదు ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా.. సలహా కావాలి అని అనుకున్నా.. ఒకరికి మరొకరు ఫోన్ చేసి మరీ అడుగుతారట. ఈక్రమంలోనే రజినీకాంత్ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే...

రజనీకాంత్‌ రీసెంట్ గా తను నటించిన దళపతి సినిమా నాటి సంగతులను  గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి, కమల్ హాసన్ ఇచ్చిన సలహా గురించి ఆయన చెప్పారు. ఇక ఆయన మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. “దళపతి సినిమా షూటింగ్ చాలా సీరియస్ గా జరుగుతోంది. అందులో విలన్ గా  అమ్రీష్‌పురీ పాత్ర  కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సీరియస్ గా చేయాల్సిన కొన్ని సీన్లు ఉన్నాయి. అందులో ఆయన చాలా క్రూరుడైన రాజకీయ నాయకుడిగా నటించారు. ఆయన కాంబినేషన్‌లో ఓ సన్నివేశం ఉంది. సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం అది.

అయితే  ఆ సీన్‌లో ఆయనతో నేను పోటీ పడి నటించాల్సి ఉంటుంది. హీరోగా ఆయనకు సవాల్‌ విసిరే సన్నివేశం అంది. ఈ సినిమా దర్శకుడు మణిరత్నం ముందే ఈ సీన్ గురించి చెప్పారు.. సినిమా మొత్తానికి ఇది  చాలా కీలకం.. మీరు ఎంత బాగా చేస్తే ఆ సీన్‌ అంతబాగా పండుతుంది అని. నేను కూడా చాలా ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను. అయితే ఎన్ని టేకులు చేసినా.. ఆసీన్ మణికి నచ్చడం లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా డైరెక్టర్ మాత్రం తృప్తి పడటంలేదు. పదుల సంఖ్యలో టేకులు తీసుకున్నారు.. కాని ఉపయోగం లేదు. దాంతో నా మీద నాకే నమ్మకంపోయింది. 

Rajinikanth Reveals How Kamal Haasan Helped Him Impress Mani Ratnam on Dalapathi Set JMS

ఇక షూటింగ్ గ్యాప్ లో నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నేను నా స్నేహితుడుకమల్ హాసన్ కు ఫోన్ చేసి విషయం ఇది అని మొత్తం చెప్పేశాను. ఆయన వెంటనే నవ్వి.. మణిరత్నంతో పనిచేసేప్పుడు ఇలాంటిది జరుగుతుందని ముందే తెలుసు. ఓ పనిచెయ్‌.. ఆ సన్నివేశాన్ని మణిరత్నాన్ని నటించి చూపించమను.’ అని సలహా ఇచ్చారు.  అప్పుడు చూడు ఏం జరుగుతుందో అని కమల్ హాసన్ అన్నారు.. 

ఇక నేను వెంటనే.. నెక్ట్స్ టేక్ కు .. నాకు రావడంలేదు .. కాస్త మీరు ఎలా చేయాలో చేసి చూపించండి అని మణిరత్నంను అడిగాను అని అన్నారు తలైవా. ఇక వెంటనే నేను ఏది చేస్తే అది ఆ టేక్ ఒకే అయిపోయింది. అని సరదాగా వెల్లడించారు రజినీకాంత్. రజనీ, కమల్‌ల స్నేహం ఎంత బలమైందో మరోసారి అర్థమైంది. మణిరత్నం గురించి తెలుసు కాబట్టే .. సరదాగా కమల్ హాసన్ ఈ పని చేసినట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios