Rajinikanth Clarity : రజినీకాంత్ పై ట్రోలింగ్.. ‘అర్థమైందా రాజా’ ఆ హీరోకు కాదు.. తలైవా క్లారిటీ!
సూపర్ స్టార్ రజనీకంత్ Rajinikanth వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. సినిమాల పరంగానే సాఫీగానే వెళ్తున్నా ఆయా కారణాలతో తలైవా ఇటీవల ట్రోల్స్ కు గురయ్యారు. దానిపై స్పందించారు.
సూపర్ స్టార్ రజనీకంత్ Rajinikanth వయస్సు మీద పడినా యంగ్ హీరోలకు తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. యాక్షన్ చిత్రాలతోనూ అదరగొడుతున్నారు. నెక్ట్స్ తన లైనప్ లోఉన్న సినిమాలపై ఇప్పటికే మంచి హైప్ నెలకొని ఉంది. చివరిగా రజనీ ‘జైలర్’ Jailerతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగానూ రికార్డు క్రియేట్ చేశారు.
అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్ లో విషయంలో రజనీకాంత్ కొన్నివ్యాఖ్యలు చేయడంతో ఆయన ట్రోల్స్ కు గురయ్యారు. ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ‘అర్థమైందా రాజా’ అనే డైలాగ్ ను వాడిన విషయం తెలిసిందే. తను ఓ కోలీవుడ్ స్టార్ హీరోను అన్నారంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దీనిపై తాజాగా ‘లాల్ సలామ్’ చిత్ర ప్రమోషన్స్ లో స్పందించారు. తనపై వస్తున్న ట్రోల్స్ కు, తను చెప్పిన డైలాగ్ పై తలైవా క్లారిటీ ఇచ్చారు.
రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘జైలర్ ఈవెంట్ లో అర్థమైందా రాజా అన్న వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పైగా ట్రోలింగ్ మొదలెట్టారు. విజయ్ దళపతిని నేను కావాలని అన్నట్టుగా చూపారు. చాలా బాధేసింది. విజయ్ ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా కళ్ల ముందే పెరిగాడు. పట్టుదలతో ఎదిగాడు. అలాంటి వ్యక్తిని నేనెందుకు అలా అంటాను. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాతో నాకే పోటీ. మా ఇద్దరనీ పోల్చకండి’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక రజనీ నెక్ట్స్ Lal Salaam సినిమాతో వెండితెరపై అలరించబోతున్నారు. ఈ చిత్రానికి రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్ నిర్మించింది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్, కపిల్ దేవ్ నటించారు. క్రికెట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.