విమర్షించిన నోర్లు మూతపడేలా వీరవిజయ విహారం చేస్తున్నాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ సినిమాతో కలెక్షన్ల దండయాత్ర చేస్తున్న తలైవా.. తాజాగా ఓ రికార్డ్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.
రజినీకాంత్ పని అయిపోయింది.. ఇంకా ఎందుకు అంత రెమ్యూనరేషన్.. ఆయన మార్కెట్ పోయింది.. ఇక డిమాండ్ రాదు అంటూ చాలా మంది చాలా రకాలుగా అన్నా.. ఓపిగ్గా .. వేటకోసం వెయిట్ చేసే సింహంలా.. ఎదురుచూశాడు రజినీకాంత్. వరుసగా సినిమాలు పోతున్నా.. ఏమాత్రం చెక్కు చెదరకుండా అలా ఎదురుచూశాడు. 70 ఏళ్లు దాటినా.. ఏమాత్రం ధైర్య కోల్పోకుండా.. సింహంలా విరుచుకుపడుతున్నాడు రజినీకాంత్.
విమర్షించిన నోర్లు మూతపడలేలా.. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్రం చేస్తున్నాడు. కేవలం పది రోజుల్లోనే జైలర్ సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేయడంతో పాటు.. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో పరుగులుపెడుతూనే ఉంది. ఒక్క తమిళంలోనే కాదు.. తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతుంది సినిమా. ఈ వయస్సులో పుష్కరకాలంగా హిట్టు చూడని ఒక హీరో.. అలాంటి అరుదైన మైలు రాయిని అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ లెక్కలు చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతుందంటే రజనీ ఏ రేంజ్‌లో వీర విహారం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈసినిమాతో రేర్ రికార్డ్ సాధించాడు రజనీకాంత్. సౌత్ ఇండియాలో ఇలా 500 కోట్ల మైలు రాయిని రెండు సార్లు అందుకున్న హీరోగా రజినీ నిలిచాడు. అయితే ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి1,2 సినిమాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. లీడ్‌లో ఉన్నాడు. ఇక రజనీ గతంలో రోబో 2.ఓ సినిమాతో తొలిసారి ఈ మార్కును అందుకున్నాడు. ఫైనల్ రన్‌లో ఈ సినిమా 800 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రస్తుతం జైలర్ స్పీడ్ చూస్తుంటే ఆ రికార్డు కూడా త్వరలోనే తుడుచుకుపట్టు పోయేలా కనిపిస్తుంది.
ఒక్క తమిళ భాషలోనే కాదు.. అన్ని భాషల్లో జౌలర్ ప్రభాంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతున్నాయిన థియేటర్లు. అంతే కాదు జైలర్ ఇప్పటి వరకూ తెలుగులో 70 కోట్ల మార్కును దాటేసి వంద కోట్ల దిశగా వెళ్తుంది. ఇక కన్నడలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌లలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మలయాళం, హిందీ భాషల్లోనూ బాక్సాఫసీ్ ను శేక్ చేస్తున్న జైలర్.. రిలీజ్ అయిన అసలు భాష తమిళంలో డబుల్ రచ్చ చేస్తోంది. డబలు సెంచరీతో దూసుకుపోతోంది. కోలీవుడ్‌లో ఇప్పటికే 200 కోట్లు పైనే కలెక్ట్ చేసింది జైలర్ మూవీ.
