Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ రానా పూర్తైవుంటే.. బాహుబలికంటే హిట్టయ్యేదట

  • ఐదేళ్ల క్రితం రజినీకాంత్ పుట్టినరోజున ప్రారంభమైన రానా చిత్రం
  • రానా చిత్రం పూర్తయి వుంటే బాహుబలిలా సూపర్ హిట్టయ్టేదన్న కేయస్ రవికుమార్
  • రజినీకాంత్ అనారోగ్యానికి గురవటంతో పెండింగ్ లో పడ్డ రానా

 

rajinikanth rana would have been more hit than bahubali if released

ప్రముఖ తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ బాహుబ‌లి  చిత్రంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దాదాపు ఐదేళ్ల క్రితం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ హీరోగా స్టార్ట్ చేసిన రాణా కానీ పూర్తి చేసి రిలీజ్ అయి ఉంటే.. బాహుబ‌లిని మించిన ఫ‌లితాలు త‌ప్ప‌నిస‌రిగా సాధించేద‌ని పేర్కొన‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌జ‌నీ బ‌ర్త్ డే రోజున ఈ సినిమాను స్టార్ట్ చేయ‌టం అదే రోజు అనారోగ్యానికి గురి కావ‌టంతో ఆ సినిమా ఆగిపోయింది.

తాజాగా బాల‌కృష్ణ 100 చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను త‌మిళంలో అనువాదం చేసి రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల వేడుక‌ను తాజాగా నిర్వ‌హించారు. రికార్డు వ్య‌వ‌ధిలో క్రిష్ పూర్తి చేసిన ఈ చిత్రం తెలుగులో ఘ‌న విజ‌యాన్ని సాధించ‌టం తెలిసిందే.

ఈ మూవీని త‌మిళ్‌లో విడుద‌ల చేసేందుకు స‌ర్వం సిద్ధం చేశారు. ఈ మ‌ధ్య‌నే డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు. తెలుగులో మాదిరే త‌మిళ్ లోనూ శాత‌క‌ర్ణి పేరుతోనే విడుద‌ల చేయ‌నున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిగా హాజ‌రైన కేఎస్ ర‌వికుమార్ మాట్లాడుతూ.. శాత‌క‌ర్ణిని కేవ‌లం 79 రోజుల్లో పూర్తి చేశార‌న్న విష‌యాన్ని తెలుసుకొని తాను ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లుగా చెప్పారు. చారిత్ర‌క నేప‌థ్యంలో సినిమాలు తీయ‌టం మామూలు విష‌యం కాద‌ని.. 2012లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో తాను తీయాల‌నుకున్న రాణాను 277 రోజుల పాటు షూట్ చేయాల‌ని ప్లాన్ చేశామ‌ని గుర్తు చేసుకున్నారు.

తాజాగా వ‌చ్చిన టెక్నాల‌జీల నేప‌థ్యంలో 150 రోజుల్లో షూట్ పూర్తి చేయ‌మ‌ని.. కానీ.. శాత‌క‌ర్ణిని  కంటే త‌క్కువ రోజుల్లో మాత్రం పూర్తి చేయ‌లేమ‌న్నారు. రాణా మూవీని కానీ పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే బాహుబ‌లి సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని రాణా ఎప్పుడో అధిగ‌మించేద‌ని చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios