Asianet News TeluguAsianet News Telugu

'వాడికి అడ్డూ లేదు, ఒడ్డూ లేదు.. ఉప్పెనరా'.. రజనీ 'పెద్దన్న' టీజర్ అదుర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్దన్న'. తమిళంలో 'అన్నాత్తే' గా విడుదుల కానుంది. దీపావళికి రిలీజ్ కానున్న పెద్దన్న చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి.

Rajinikanth Peddhanna telugu teaser out
Author
Hyderabad, First Published Oct 23, 2021, 6:10 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్దన్న'. తమిళంలో 'అన్నాత్తే' గా విడుదుల కానుంది. దీపావళికి రిలీజ్ కానున్న పెద్దన్న చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, మీనా.. స్టార్ హీరోయిన్లు నయనతార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇప్పటికే తమిళంలో ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా తెలుగు టీజర్ విడుదల చేశారు. టీజర్ లో రజనీ లుక్స్ చూస్తుంటే వింటేజ్ రజనీ గుర్తుకు రావడం ఖాయం. Rajinikanth అభిమానులు కోరుకునే అంశాలతో దర్శకుడు శివ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. Peddhanna టీజర్ మొత్తం రజనీ షో సాగింది. 

పంచె కట్టులో రజనీ సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇస్తున్నారు. 'పల్లెటూరోడిని శాంతంగానే చూసుంటావ్.. కోప్పడి చూడలేదు కదా.. ఉప్పెనరా' .. 'వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు' అంటూ సాగే మాస్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ లో విజువల్స్ చూస్తుంటే యాక్షన్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. 

Also Read: సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

రజనీకాంత్ చివరగా నటించిన పేట, దర్బార్ చిత్రాలు యావరేజ్ గానే నిలిచాయి. దీనితో రాజని ఫ్యాన్స్ ఓ బ్లాక్ బస్టర్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. 'పెద్దన్న' చిత్రం తమ  దాహం తీరుస్తుందని భావిస్తున్నారు. సంగీత దర్శకుడు ఇమాన్.. మంచి బ్యాగ్రౌండ్ సంగీతం అందించారు. 

సన్ పిక్చర్స్ సంస్థ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీవాళీ కానుకగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 4న విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా పెద్దన్న టీజర్ విడుదల చేశారు. టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios