ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా అయితే తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో   భారీ అంచనాలు అయితే ఉన్నాయి.   ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా..

నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో 'జైలర్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ఈ సినిమాని చాలా స్పెషల్ గా భావించి నిర్మిస్తోంది. అందులో భాగంగా ...ఒక్క భాషలోని సూపర్ స్టార్స్ ని ...సినిమాలో కీ రోల్స్ కు తీసుకొస్తోంది. అందులో భాంగంగా ఇప్పటికే కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ని సీన్ లోకి తెచ్చారు. అలాగే మళయాళం నుంచి మోహన్ లాల్ ని తీసుకున్నారు. ఆ విషయం కన్ఫర్మ్ చేస్తూ లాలేట్టన్.. పిక్‌ను విడుదల చేసింది. 80,90వ దశకం నాటి లు‌క్‌లో మోహన్ లాల్ ఉన్నారు. 

ఈ పోస్టర్‌లో లెపర్డ్ ప్రింట్ షర్ట్ ధరించి పొడవాటి జుట్టుతో మోహన్ లాల్ లుక్ ఉంది. సినిమా ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్‌లో ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారనే దానిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ఇదే కోవలో తెలుగు నుంచి కూడా ఓ స్టార్ ని సినిమాలోకి తెస్తున్నారని సమాచారం. అయితే ఆయన ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. చిరంజీవి, వెంకటేష్ లలో ఒకరు నటించే అవకాసం ఉందంటున్నారు. రజనీకాంత్ స్వయంగా అడిగితే కాదనేదెవరు .

ఇక సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రతీ సినిమాకు ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఆయన సినిమా వస్తోందంటే మరో మ్యాజిక్‌ చేయడానికి వచ్చేస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తారు. ఈసారి జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టనున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా అయితే తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

అదేమిటంటే.. ఈ చిత్రం రీసెంట్ సూపర్ హిట్ “ఖైదీ” తరహా లోనే కనిపిస్తుందని చెప్తున్నారు..ఈ సినిమా అంతా కూడా ఒక్క రాత్రి లోనే జరిగిపోతుందట. కార్తీ నటించిన ఖైదీ ఒక్క రాత్రి సినిమానే అయినా ఆడియెన్స్ కి ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో , నెల్సన్ ఎలా డీల్ చేసి ఉంటాడో చూడాలంటున్నారు అభిమానులు. బాగా హైప్‌తో రిలీజైన ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు బాగానే ఆడినా రజనీ స్థాయిలో హిట్టవ్వలేకపోయాయి. ప్రస్తుతం రజనీకాంత్‌ ఆశలన్నీ ‘జైలర్‌’ సినిమాపైనే ఉన్నాయి.

విజయ్‌తో కలిసి బీస్ట్‌ మూవీ తీసిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో తొలిసారి రజనీకాంత్‌ ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రజనీతోపాటు శివ రాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, వసంత్‌ రవి, యోగి బాబు, వినాయకన్‌ నటిస్తున్నారు. రజనీతో కలిసి నరసింహ మూవీలో తన నట విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ మరోసారి అతనితో కలిసి నటిస్తోంది.

 యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.