తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా సినిమా రెగ్యూలర్ షూటింగ్ పై అప్డేట్ అందింది.
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నెక్ట్స్ `బీస్ట్` (Beast) ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `తలైవా 169` (Thalaiva 169) వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది. కోలీవుడ్ లో చాలా తక్కువ టైమ్ లో మంచి పేరు సాధించాడు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్. ఇటీవల థళపతి విజయ్ తో ‘బీస్ట్’ చిత్రాన్ని తెరకెక్కించి కాస్తా నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో హిట్ కొట్టే పనిలో ఉన్నాడు నెల్సన్. ప్రస్తుతం రజినీకాంత్ సినిమాపైనే ఫోకస్ పెట్టారు.
సన్ పిక్చర్స్ వారు నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ తో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. దీంతో ‘తలైవా169’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కాగా, సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంబం కాబోతుందంటూ రజినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యూలర్ షూట్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటులు, లోకేషన్స్, టెక్నీషియన్లను ఫైనల్ చేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని తెలుస్తోంది.
ఇక రజినీకాంత్ చివరిగా ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాలతో ప్రేక్షకులను, తన అభిమానులను అలరించారు. 70 ఏండ్లలోనూ రజినీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మాసిజం, గ్రేస్ ఏమాత్రం తగ్గకపోవడంతో ఆయన తదుపరి చిత్రం ‘తలైవా169’ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ ఇందుకు ఐశ్వర్య నో చెప్పినట్టు టాక్. గతంలో రజినీతో కలిసి ‘రోబో’లో నటించి ఐషు. మరోవైపు శివకార్తీకేయ (Shiva Karthikeya) కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. దీంతో మల్టీస్టారర్ మూవీ రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
