సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త విషాగన్ తో సౌందర్య వివాహం జరగనుంది.

ఈ క్రమంలో తలైవా సినీ ప్రముఖుల నివాసాలను వెళ్లి మరీ వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ నటుడు ప్రభు.. రజినీతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేశారు. అలానే కమల్ హాసన్ ని కలిసి పెళ్లి శుభలేఖ అందించారు రజినీకాంత్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. రజినీకాంత్ ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులను కలుస్తున్నారో.. అది కేవలం పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమేనని, దీనికి తన రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ముందే క్లారిటీ ఇచ్చారు.

పెళ్లి ఫిబ్రవరి 11న జరిగిన తరువాత 12న ఘనంగా వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.