ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కె.వి ఆనంద్‌ కి సూపర్‌స్టార్ట్స్ రజనీకాంత్‌, మహేష్‌బాబు, ధనుష్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. 

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కె.వి ఆనంద్‌ కి సూపర్‌స్టార్ట్స్ రజనీకాంత్‌, మహేష్‌బాబు, ధనుష్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కె.వి ఆనంద్‌ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం షాక్‌కి గురయ్యింది. అద్భుతమైన, విలక్షణమైన సినిమాలను అందించిన దర్శకుడు ఇక లేరనే వార్తతో విచారం వ్యక్తం చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

రజనీకాంత్‌ స్పందిస్తూ, `గౌరవనీయమైన కె. వి ఆనంద్‌ మరణం దిగ్ర్భాంతికరమైనది. చాలా బాధాకరమైనది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని తమిళంలో ట్వీట్‌ చేశారు.

Scroll to load tweet…

మహేష్‌బాబు స్పందిస్తూ, `కె.వి ఆనంద్‌ మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. చిత్ర దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా ఆయన ప్రతిభ అద్భుతం. వారి కుటుంబానికి,ప్రియమైన వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు. 

Scroll to load tweet…

`సున్నితమైన దయగల నిజాయితీ గల వ్యక్తి కన్నుమూశారు. జీవిత ప్రేమ, ఆనందంతో నిండిన చాలా మధురమైన మనిషి. కె.వి ఆనంద్‌ సర్ చాలా త్వరగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు సర్‌. ఆయన కుటుంబానికి నా సానుభూతి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని పేర్కొన్నారు హీరో ధనుష్‌.

Scroll to load tweet…