Rajinikanth: `లాల్ సలామ్` టీజర్.. గల్లీ క్రికెటర్లకి, మాఫియా లీడర్‌కి సంబంధమేంటి?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రూపొందిస్తున్న `లాల్ సలామ్` మూవీలో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఎలా ఉందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `లాల్ సలామ్`. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రూపొందిస్తున్న మూవీ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. ఈ మూవీ నుంచి దీపావళి సర్‌ప్రైజ్ వచ్చింది. `లాల్ సలామ్` టీజర్‌ని విడుదల చేశారు.
గ్రామీన వాతావరణంలో సినిమా సాగుతుంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ రెండు టీములుగా క్రికెట్ ఆడుతుంటారు. రసవత్తరంగా పోటీలు జరుగుతుంటాయి. పండగ వేళ జరిగే ఈ క్రికెట్ పోటీలపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు, గొడవలు జరుగుతుంటాయి. పండగ కాస్త విషాదంగా మారుతుంది. ఇది రాజకీయ నాయకుల నుంచి మాఫియా వరకు వెళ్తుంది.
ఈ క్రమంలో మొహినుద్దీన్ రజనీకాంత్ ఎంట్రీ ఇస్తారు. అల్లర్లని ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ప్రత్యర్థలు భరతం పడతాడు. మరి క్రికెట్‌కి, ఆ మాఫియా లీడర్‌కి ఉన్న సంబంధమేంటి? ఆయనెందుకు వచ్చాడు, ఆయన కథేంటి? అసలు క్రికెట్ మ్యాచ్‌లో ఏం జరిగిందనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ఏదో విషయం ఉన్నట్టుగా అనిపిస్తుంది.
`జైలర్` తర్వాత రజనీకాంత్ నుంచి వస్తోన్న మూవీ ఇది. ఇందులో ఆయన కీలక పాత్రలో కొంత నిడివి ఉన్న పాత్రనే పోషిస్తున్నారు. కానీ ఆయన ప్రభావం సినిమా మొత్తం ఉంటుందని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.