రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కాలా న్యూ లుక్

rajinikanth kaalaa movie birthday look creating buzz
Highlights

  • సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కాలా
  • పా రింజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజినీ మూవీ
  • రజినీ పుట్టినరోజు సందర్భంగా కాలా న్యూ లుక్ పోస్టర్ విడుదల

సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఆయన హీరోగా వస్తున్న కొత్త సినిమా 'కాలా' నుండి సెకండ్ లుక్ బయటకు వదిలింది చిత్రయూనిట్. గడ్డంతో కళ్ళజోడు పెట్టుకొని ఎంతో సీరియస్‌గా ఈ లుక్‌లో రజినీ దర్శనమిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌ లుక్ విడుదలచేశారు. అందులో రజినీ థార్ జీపుపై కూర్చొని స్టైల్‌గా కనిపించారు. ఈ రెండు లుక్స్ ఆకట్టుకునేలా ఎంతో డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే తపన ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోయింది.

 

వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రజినీ అల్లుడు ధనుష్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.0 ' కూడా 2018 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

loader