సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తో కమ్ బ్యాక్ అయ్యారు. అదే సమయంలో భోళా శంకర్ చిరంజీవికి భారీ షాక్ ఇచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాల్లో జైలర్ దే పై చేయి అయ్యింది.  

ఒక్క రోజు వ్యవధిలో బోళా శంకర్-జైలర్ విడుదలయ్యాయి. ఆగస్టు 10న విడుదలైన జైలర్ వరల్డ్ వైడ్ కుమ్మేస్తుంది. యూఎస్ లో ఈ మూవీ $ 3 మిలియన్ మార్క్ దాటేసింది. భోళా శంకర్ ఇంకా వన్ మిలియన్ కూడా టచ్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ భోళా శంకర్ చిత్రంపై ఆధిపత్యం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నైజాం ఏరియాలో జైలర్ మూడో రోజు వసూళ్లు భోళా శంకర్ రెండో రోజు వసూళ్ల కంటే ఎక్కువ కావడం షాకింగ్ పరిణామం. 

ఆగస్టు 11న విడుదలైన భోళా శంకర్ ఎంతటి దారుణ పరాజయం కానుందో ఇది తెలియజేస్తుంది. భోళా శంకర్ శనివారం రూ. 1 కోటి రూపాయల షేర్ అందుకుంది. అదే సమయంలో జైలర్ రూ. 1.65 కోట్ల షేర్ రాబట్టింది. జైలర్ కి సరైన థియేటర్స్ లేవని సమాచారం. మోస్ట్ రెవెన్యూ వచ్చే థియేటర్స్ లో భోళా శంకర్ ఉంది. ఈ కారణంగా జైలర్ కి వసూళ్లు తగ్గుతున్నాయట. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ రెండు వందల కోట్ల మార్క్ కి దగ్గరైంది. 

ఇక భోళా శంకర్ వసూళ్లు వరల్డ్ వైడ్ యాభై కోట్ల గ్రాస్ డేట్ పరిస్థితి లేదు. నైజాంలో మొదటి రోజు భోళా శంకర్ రూ. 4.5 కోట్ల షేర్ అందుకుంది. రెండో రోజు రూ. 1 కోటి. భోళా శంకర్ నైజాం హక్కులు రూ. 22 కోట్లకు అమ్మారు. సెకండ్ డేనే 70 శాతం వసూళ్లు పడిపోయాయి. ఎంత మ్యాజిక్ చేసినా భోళా శంకర్ షేర్ రూ. 30 కోట్లు దాటడం కష్టమే. చూస్తుంటే భోళా శంకర్ బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. 

మెహర్ రమేష్ పదేళ్ల గ్యాప్ తర్వాత భోళా శంకర్ వంటి అవుట్ డేటెడ్ మూవీ తీశాడు. ఇలాంటి కథను ఎంచుకున్నందుకు ముఖ్యంగా చిరంజీవి విమర్శలపాలవుతున్నారు. రెండు రోజులుగా ఫ్యాన్స్ సైతం ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందు రీమేక్స్ చేయకండి, భోళా శంకర్ వంటి రీమేక్స్ అసలు చెయ్యొద్దని చిరంజీవిని వేడుకుంటున్నారు. ఇక భోళా శంకర్ నిర్మాతగా ఉన్న దిలీప్ సుంకరను ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు ముంచేశాయి.