Asianet News TeluguAsianet News Telugu

రజనీకాంత్‌ `జైలర్‌` రిలీజ్‌ డేట్‌.. ఎటొట్టి చిరంజీవి సినిమాకే దెబ్బ ?

రజనీకాంత్‌ నటించిన `జైలర్‌` సినిమా విడుదల తేదీ ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యింది. అయితే ఇది చూడబోతుంటే చిరంజీవి సినిమాకి ఎఫెక్ట్ కానుందట. అదే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతుంది.

rajinikanth jailer movie release date it effect on chiranjeevi movie ? arj
Author
First Published Apr 25, 2023, 3:57 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం `జైలర్‌` చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న సినిమా ఇది. రజనీకాంత్‌కి జోడీగా తమన్నా నటిస్తుండగా, కీలక పాత్రల్లో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, తెలుగు నుంచి సునీల్‌ నటిస్తున్నారు. భారీ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ రిలీజ్‌ ఎప్పుడనేది ఆసక్తికరంగా, పెద్ద సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో తాజాగా రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ చేసిందట యూనిట్. 

మొదట ఈ సినిమాని ఏప్రిల్‌లోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ `పొన్నియిన్‌ సెల్వన్‌ 2` నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఇండిపెండెంట్‌ డేని టార్గెట్‌ చేశారట. ఆగస్ట్ 10న ఈ సినిమాని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. ఈ సాయంత్రం ఆరుగంటలకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ చేయనుంది. తమిళంలో ఒక్క రోజు గ్యాప్‌తో శివకార్తికేయన్‌ `మహావీరుడు` కూడా రిలీజ్‌ కాబోతుండటం విశేషం. ఓ రకంగా హీరో, అభిమాని సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి. రజనీకి శివకార్తికేయన్‌ అభిమాని అనే విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే రజనీకాంత్‌ సినిమాలు తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంటాయి. తమిళంతోపాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఏకకాలంలో విడుదల చేస్తుంటారు. ఇది చాలా ఏళ్ల నుంచి వస్తున్నది. పరోక్షంగా ఇది పాన్‌ ఇండియా రిలీజ్‌ అనే చెప్పాలి. ఇప్పుడు కూడా `జైలర్‌` సినిమాని తెలుగులో ఆగస్ట్ 10కి రాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతోపాటు శివకార్తికేయన్‌ సినిమా `మహావీరుడు` కూడా తెలుగులో రిలీజ్‌ కానుంది. 

ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ ఇప్పుడు చిరంజీవిపై పడబోతుందని చెప్పొచ్చు. మెగాస్టార్‌ నటించిన `భోళాశంకర్‌` ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అదే డేట్‌కి `టిల్లు స్వ్కైర్‌` సినిమా రాబోతుంది. ఈ రెండు సినిమాలతోపాటు రజనీకాంత్‌ `జైల్‌`, శివకార్తికేయన్‌ `మహావీరుడు` సినిమా రిలీజ్‌ కాబోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకి చాలా టైట్‌ పొజీషియన్‌ నెలకొంది. ఇది ఓ రకమైన ఫైటింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ని క్రియేట్‌ చేస్తుందని చెప్పాలి.

ఇదే అంటే మరో సినిమా పాన్‌ ఇండియా మార్కెట్‌ని టార్గెట్‌ చేసింది. అదే సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన `యానిమల్‌` సినిమా. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. ఇది కూడా ఆగస్ట్ 11నే రాబోతుంది. తెలుగు డైరెక్టర్‌ సినిమా కావడం, రష్మిక హీరోయిన్‌ కావడంతో దీని ప్రభావం తెలుగులో బాగానే ఉంటుంది. ఇది కూడా తెలుగు సినిమాలకు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎటొచ్చి ఇది చిరంజీవి, సిద్దు (టిల్లు స్వ్కైర్‌) సినిమాలకే ఎఫెక్ట్ కానుంది. ఎందుకంటే `భోళాశంకర్‌`ని కేవలం తెలుగులోనే రిలీజ్‌ చేయబోతున్నారు. `టిల్లు స్వ్కైర్‌` కూడా తెలుగు రాష్టాల్లోనే రానుంది. ఈ సినిమాలు ఇతర భాషల్లో రిలీజ్‌ కావడం లేదు. మన సినిమాల వల్ల ఇతర స్టార్లకి సమస్య లేదు, ఎటొచ్చి మన హీరోల సినిమాలకే దెబ్బ పడబోతుందనిపిస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios