రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీ కాంతో. జైలర్ సినిమా తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు.. రికార్డ్ ల మీద రికార్డ్ లు కూడా సాధిస్తున్నాడు రజినీ. 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా.. ఎంతో కాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ కు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది. ఇక రజినీకాంత్ పని అయిపోయింది అని ప్రచారం చేసినవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు.. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది జౌలర్. 

ఈసినిమాకు రజినీకాంత్ యాక్టింగ్, నెల్సన్ టేకింగ్ తో పాటు.. మరీ మూఖ్యంగా రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళింది. సినిమా బీజియం తో పాటు.. రజినీకాంత్ ఎలివేషన్ సీన్లు.. పాటలు దుమ్మురేపాయి. అందులో రజినీస్టైల్ ను ఎలివేట్ చేస్తూ సాగే హుఖుం పాట.. దుమ్ము రేపుతోంది. ఇప్పటికీ రికార్డ్ ల పరంపర కొనసాగిస్తోంది. 

అయితే హుకుమ్ లిరికల్ వీడియో యూ ట్యూబ్ లో మరొక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సాంగ్ తో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. రమ్య కృష్ణ, యోగి బాబు, శివ రాజ్ కుమార్, సునీల్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు.