సూపర్ స్టార్ రజనీ కాంత్ కు 70 ఏళ్లు దాటాయి. ఇక సినిమాలకు విరామం ఇస్తాడు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. కాని అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. షాక్ ఇచ్చారు తలైవా.
70 ఏళ్లు వచ్చియి ఇక సినిమాలు ఏం చేస్తారు లే.. ఇక ఆపేస్తారేమో సూపర్ స్టార్ రజనీ కాంత్ అని చాలా మంది చెవులు కొరుక్కుంటున్న వేళ... అందరికీ షాక్ ఇస్తూ.. రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ ఒకేసారి రెండు సినిమాలకు సైన్ చేశారట తమిళ సూపర్ స్టార్.. తలైవా రజనీ కాంత్. ఈ మధ్య ఎక్కువగా యంగ్.. న్యూ డైరెక్టర్స్ తో జర్నీ చేస్తున్నారు రజనీ కాంత్. అయితే వరుసగా ఆయన సినిమాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. వాటికి తో డు ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంటారేమో అని రూమర్స్ గట్టిగా వినిపించాయి.
రాజకీయాల నుంచి అనారోగ్యం దృష్యా వెనకడుకు వేసిన రజనీ.. ఇక సినిమాలకు కూడా చిన్నగా పుల్ స్టాప్పెడతారంటూ ... సోషల్ మీడియాలో వరుసగా కథను వండి వార్చారు జనాలు. కాని వాటిని తిప్పుకొడుతూ.. తనకు సినిమాల్లో రిటైర్‌మెంట్ ఆలోచనే లేదని చెప్పకనే చెప్పారు సూపర్ స్టార్. చెప్పడం మాత్రమ్రేమ కాదు, ఆచరణలో చేసి చూపించారు కూడా. తాజాగా ఆయన లైకా ప్రొడక్షన్స్ సంస్థలో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.
ఈ సంస్థ లో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ 2.oతో పాటుగా దర్బార్ సినిమాల్లో నటించారు. ఇక కొత్తగా తెరకెక్కించే సినిమాలలో ఒక దాన్ని డాన్ సినిమా దర్శకుడు శిబి చక్రవర్తి రూపొందిస్తారని, మరో సినిమాను పెరియసామి డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఉండబోతున్నాయట. వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
