వెయ్యి రూపాయల నుంచి 200 కోట్ల వరకూ... రజినీకాంత్ తెలుగు సినిమాకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
సాధారణ కండెక్టర్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. సూపర్ స్టార్ గా ఎదిగాడు రజినీకాంత్.. ప్రస్తుతం సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్న తలైవా.. తెలుగు సినిమాకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

రీసెంట్ గా జైలర్ సినిమాతో బ్లాకబ్ బస్టర్ హిట్ ను కొట్టాడు సూపర్ స్టార్ రజనీకాంత్. చాలా కాలం తరువాత ఇంత పెద్ద హిట్ సాధించడంతో దిల్ ఖుష్ అవుతున్నారు టీమ్. `జైలర్` హిట్ తో ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు టీమ్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న జైలర్ దాదాపు 700 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ సినిమా కలెక్షన్లతో ఖుషీ అయిప్యిన నిర్మాత కళానిధి మారన్ వరుసగా లాభాలను జౌలర్ స్టార్లకు పంచేసి.. కార్లు గిఫ్ట్ గా ఇచ్చేశాడు కూడా.
ఇక ఈసినిమాకు రజనీకాంత్ కు అన్నీ కలిపి 200 కోట్ల వరకూ ముట్టినట్టు తెలుస్తోంది. ఆయన రెమ్యూనరేషన్ 100 కోట్లు అయితే.. లాభాల్లోంచి మరో 100 కోట్లు నిర్మాత ఇచ్చారట. ఈక్రమంలో రజనీకాంత్ రెమ్యూనరేషన్ కు సబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రజనీకాంత్ రికార్డు సృష్టించాడంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదే తరుణంలో రజనీకాంత్ ఫస్ట్ తెలుగు మూవీ రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.1975లో కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు సూపర్ స్టార్ రజీనీకాంత్. అందుకే బాలచందర్ ను తన గురువు, దైవం కంటే ఎక్కువగా ఆరాధిస్తాడు.
ఇక తెలుగులో ఆయన చేసిన మొదటి సినిమా అంతులేని కథ(Anthuleni Katha). బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్(Kamal Haasan), సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు. 1976లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈసినిమా కోసం రజినీ కాంత్ 1000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ విషయం తెలిసి ఆయన ఫ్యాన్స నోరెళ్ళబెడుతున్నారు.
ఈసినిమాలో పనిపాటలేకుండా.. చెల్లెల్లి సంపాదన మీద ఆధారపడి బ్రతికే ఒక తాగుబోతు పాత్రను రజనీకాంత్ పోషించాడు. అంతే కాదు ఈపాత్రలో జీవించి.. తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే ఈ సినిమాకు రజనీకాంత్ అందుకున్న రెమ్యునరేషన్ జస్ట్ 1000. వెయ్యి నుంచి 200 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగి.. ఎంతో మందికి రోల్డ్ మోడల్ గా నిలిచారు సూపర్ స్టార్ రజినీకాంత్.