రజినీకాంత్ అభిమాని చేసిన సాహసం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆయన్ని కలిసేందుకు సదరు అభిమాని చెన్నై నుండి ఉత్తరాఖండ్ వరకు కాలినడకన వెళ్ళాడు.  

జైలర్ మూవీ విడుదలకు ఒకరోజు ముందు రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక ట్రిప్ లో భాగంగా ఆయన రిషికేష్, బద్రీనాథ్, ద్వారక, బాబాజీ కేవ్ సందర్శించనున్నారు. ఒక వారం పాటు రజినీ స్పిరిట్యువల్ టూర్ సాగనుందని సమాచారం. రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర గురించి ముందే తెలుసుకున్న ఓ అభిమాని ఆయన్ని హిమాలయాల్లో కలవాలి అనుకున్నాడు. అందుకు చెన్నై నుండి ఉత్తరాఖండ్ కి కాలి నడకన బయలు దేరాడు. మొత్తం 55 రోజులు నడిచాడు. 

చివరికి తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. రజినీకాంత్ ని ఉత్తరాఖండ్ లో ఆ వీరాభిమాని కలిశారు. రజినీకాంత్ ఆ అభిమానిని కలవడమేకాకుండా ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమాని సాహసంతో పాటు రజినీకాంత్ దాతృత్వం గురించి సోషల్ మీడియా జనాలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. 

Scroll to load tweet…

కాగా జైలర్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. జైలర్ మూడు వందల కోట్ల మార్క్ దాటేసింది. సరైన హిట్ లేక సతమతమవుతున్న రజినీకాంత్ కి జైలర్ భారీ బ్రేక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం జైలర్ దుమ్మురేపుతోంది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి ఏపీ/తెలంగాణాలలో రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రూ. 18 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కి జైలర్ పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. 

జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ కీలక రోల్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మించగా అనిరుధ్ సంగీతం అందించారు. తమన్నా సైతం ఓ పాత్రలో అలరించింది. తమన్నా-రజినీకాంత్ ల నువ్వు కావాలయ్యా సాంగ్ అత్యంత ఆదరణ పొందింది.