రజనీకాంత్ దీపావళి ట్రీట్.. `లాల్ సలామ్` టీజర్‌కి డేట్, టైమ్ ఫిక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా వారిని ఖుషీ చేసేందుకు ట్రీట్ తెస్తున్నారు. అందుకు డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల `జైలర్`తో దుమ్మురేపాడు. తమిళ చిత్ర పరిశ్రమకి ఇండస్ట్రీ హిట్‌ని అందించాడు. తనకు సరైన మూవీ పడితే ఎలా ఉంటుందో నిరూపించారు. `జైలర్` మూవీ ఆరువందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కోలీవుడ్‌ని షేక్ చేసింది. ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నారు రజనీ. సంక్రాంతికి ఆయన `లాల్ సలామ్` అనే మూవీతో సందడి చేయబోతున్నారు.
అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రూపొందించడం విశేషం. ఇందులో రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మోయినుద్దీన్ అనే ముంబయి మాఫియా డాన్‌గా సూపర్ స్టార్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. విష్ణు విశాల్ మెయిన్ రోల్ చేస్తున్నారు. `బాష` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ ఇలా మాఫియా లీడర్ తరహా పాత్ర పోషిస్తుండటం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కి రజనీ గుడ్ న్యూస్ చెప్పారు. `లాల్ సలామ్` నుంచి దివాళీ ట్రీట్ తీసుకురాబోతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 12న ఉదయం పది గంటల 45నిమిషాలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఇది నిమిషం 34 సెకన్లు ఉండబోతుందట. సండే రోజు ఫ్యాన్స్ అసలైన పండగ చేసుకునేలా ఈ టీజర్ ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక రజనీ కీలక పాత్రలో, విష్ణు విశాల్ హీరోగా, విక్రాంత్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న `లాల్ సలామ్` మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుంది. సంక్రాంతికి గ్రాండ్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. `జైలర్` సక్సెస్ ఈ మూవీకి కలిసి రాబోతుందని చెప్పొచ్చు.