లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్  హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా మేకింగ్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. 

‘కూలీ’ సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇందులో రజనీ కూతురిగా శృతిహాసన్ నటించింది. టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్ ఖాన్ గెస్ట్ గా మెరవబోతున్నారు. 

‘కూలీ’ మేకింగ్ వీడియో

భారీ తారాగణంతో వస్తున్న ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికితోడు లోకేష్‌ కనగరాజ్‌, రజనీ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడం కూడా ఈ అంచనాలకు మరో కారణం. ఇక రజనీ అభిమానులను ఖుషీ చేసేందుకు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్ సినిమాకి సంబంధించిన అప్‌ డేట్లు ఇస్తుంది. 

అందులో భాగంగా తాజాగా మేకింగ్ వీడియోని విడుదల చేసింది. ఇందులో `కూలీ` సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్, దర్శకుడితో మాట్లాడుతూ, సీన్స్ చూస్తూ, ప్రజలను కలుస్తూ కనిపించారు. సెట్‌లో ఆయన ఎలా ఉంటారో ఇందులో చూపించారు. చాలా సింపుల్‌గా రజనీ కనిపించడం విశేషం. 

Scroll to load tweet…

‘జైలర్ 2’ అప్డేట్

‘కూలీ’ ఈ ఏడాది మే నెలలో విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టుకి వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’లో రజనీకాంత్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్నారు. వీరితోపాటు తెలుగు నుంచి బాలకృష్ణ నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆయనది గెస్ట్ రోల్‌ అని టాక్.