2.0 రిలీజ్ డేట్ చెప్పేసిన రజినీ, టీజర్ జాన్ ఫస్ట్ వీక్ లోనే..

rajinikanth confirms robo 2 point zero release date
Highlights

  • సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిిన రోబో 2.0
  • శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశంలోనే భారీ బడ్జట్ మూవీ
  • ఈ మూవీ టీజర్, రిలీజ్ డేట్ ప్రకటించిన రజినీ

భారతదేశ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా రజినీ కాంత్ రోబో 2.0. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.  ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని భారతదేశ సినీ లోకం ఎదురుచూస్తోంది. తెలుగు తమిళ్ హిందీ భాషల్లోనే కాకుండా అరబిక్ భాషలో కూడా ఈ 2.0 రిలీజ్ అవుతోంది. పూర్తిగా 3D టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమా కోసం చాలా థియేటర్స్ ఇప్పటికే 3D స్క్రీన్స్ గా మారాయి.

 

ఇక 2.0 హంగామా జనవరి 6 నుంచి మొదలు కానుంది. ఎందుకంటే ఆ రోజే సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషల్లో టీజర్ విడుదల కానుంది. ఇక సినిమా విడుదల విషయనికి వస్తే.. గత కొంత కాలంగా రిలీజ్ డేట్ పై అనేక రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. మొదట జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా చిత్ర యూనిట్ ఫైనల్ చేయలేదు. అయితే రీసెంట్ గా రజినీ కాంత్ అభిమానులతో జరిపిన మీటింగ్ లో సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశాడు.2.0 సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోందని రజినీ ప్రకటించడంతో  సస్పెన్స్ కి తెరపడింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే సినిమా లెట్ అయ్యిందని చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లను చేసుకుంటోంది. మరి సమ్మర్ లో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.

loader