Asianet News TeluguAsianet News Telugu

రజినీ కండెక్టర్ స్టైల్ రిపీట్.. ఫ్యాన్స్ కు ఇంతకు మించిన ట్రీట్ ఉంటుందా? వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దక్కింది. తలైవా సినిమాల్లోకి రాకముందు కండక్టర్ గా చేసిన విధిని మరోసారి రిపీట్ చేశారు. ఆ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. 
 

Rajinikanth Conductor Style  Video Goes Viral NSK
Author
First Published Sep 10, 2023, 9:14 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’తో తన అభిమానులను  ఫుల్ ఖుషీ చేసిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. గత నెల ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన Jailer  బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అదిరిపోయే రెస్పాన్స్ తో పాటు దుమ్ములేపే వసూళ్లతో సత్తా చాటింది. దీంతో రజినీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత తలైవా మాస్ యాక్షన్ ట్రీట్ అభిమానులకు ఫుల్ మీల్స్ ను అందించింది. 

ఇదే సమయంలో రజినీ ఫ్యాన్స్ కు మరో ట్రీట్ అందింది. ‘జైలర్’ రిలీజ్ కు ముందుకు రజినీకాంత్ ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. నార్త్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. అలాగే హిమాలయాలకు కూడావెళ్లారు. అక్కడి నుంచి నేరుగా తను సినిమాల్లోకి రాకముందుకు కండక్టర్ గా విధులు నిర్వహించిన డిపోను సందర్శించారు. అక్కడి సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. అందరిని పలకరించి ఖుషీ చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. రజినీ అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా ఉంది. బెంగళూరులోని ఓ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పంచెకట్టులో పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, పూజారులకు అర్చన సమర్పించే సమయంలో తన లాల్చీ హ్యాండ్ మడతలో  దాచిన డబ్బును తీసి ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కండక్టర్ స్టైల్ ను రిలీట్ చేశారంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios