మోడీ ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్లు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తెలియజేశారు. రీసెంట్ చెన్నైలో మీడియా ముందుకు వచ్చిన రజిని ప్రస్తుత రాజకీయాలపై తన వివరణ ఇచ్చారు. 

ఈ ఎన్నికల్లో భారత జనతా పార్టీ సాధించిన విజయం నరేంద్ర మోడీకి దక్కుతుందని ఆయన చరిష్మాటిక్ విజయాన్ని అందుకున్నట్లు తెలిపారు. అలాగే మాజీ ప్రైమ్ మినిష్టర్స్ ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీ తరహాలో మోడీ ముందుకు సాగుతున్నారని ఆయన ఒక ఛరిష్మాటిక్ లిడర్ అని సంబోధించారు. 

ఏఐసికి రాహుల్ రాజీనామా చేయవద్దని రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని తెలుపుతూ.. ఇలాంటి అనుభవాలు శాశ్వతం కాదని రాహుల్ తనను తాను నిరూపించుకోవాలని అన్నారు. ఇక కమల్ హాసన్ పాలిటిక్స్ పై స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన ప్రభావం ఎంత ఉందొ తెలిసిందని రజినీకాంత్ వివరణ ఇచ్చారు.