విజయ్ లియో సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
విజయ్ లియో మూవీపై స్పందించారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. తన సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్న రజనీకి.. మీడియా నుంచి లియో మూవీపై ప్రశ్న ఎదురయ్యింది. దాంతో ఆయన ఏమన్నారంటే..?

జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ తో జోరు మీద ఉన్నాడు సూపర్ స్టార్ రజీనీకాంత్. ఇక రజనీపని అయిపోయింది అన్నవారికి ఈసినిమాతో గట్టిగా బుద్ది చెప్పాడు. జైలర్ తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన నెక్ట్స్ సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన తన 170 వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ సినిమాతో సంచలనం సృష్టించిన తమిళ దర్శకుడు జ్ఞానవేల్ ఈసినిమా ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే కేరళలోని త్రివేండ్రంలో స్టార్ట్ అయ్యింది. అక్కడ ఉన్న అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో జరుగుతోంది. దాదాపు 46 ఏళ్ళ తరువాత రజినీ ఈ ప్రాంతంలో అడుగు పెట్టారు. ఇక తాజాగా ఇక్కడ షేడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వేసిన సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు టీమ్. సోమవారం షూటింగ్ ముగించుకుని రజనీకాంత్ చెన్నై వెళ్లేందుకు కన్యాకుమారి నుంచి తూత్తుకుడి వాగైకులం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయన్ను మీడియా మిత్రులు చుట్టుముట్టారు. దాంతో వారితో కాసేపు ముచ్చడించారు రజనీకాంత్.
రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇక్కడ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అందకే చెన్నైకు వెళుతున్నట్లు తెలిపాడు. ఇక వెంటనే విలేకరులు విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా రిలీజ్ అవుతుంది కదా.. మరి ఆసినిమా గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటూ.. అడిగారు అప్పుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. లియో సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రజనీ తెలిపాడు.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమా లియో. హీరోయిన్ గా పని అయిపోయింది అనకున్న త్రిష.. ఈసినమాతో మరోసారి లైమ్ లైట్ లోకి వస్తోంది. తనను తాను హీరోయిన్ మెటీరియల్ గా రెండో సారి పొన్నియన్ సెల్వన్ సినిమాతో నిరూపించుకుంది బ్యూటీ.. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది లియో.