గత ఏడాది నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న 2.0 మొత్తానికి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినీ చరిత్రలో మొదటిసారి అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ విజువల్ వండర్ రజినీకాంత్ కెరీర్ లో మర్చిపోలేనిది. 

ఇకపోతే ఆ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ ముగిసేలోపే సూపర్ స్టార్ పెట్ట సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ రజినీకాంత్ తో చాలా స్పీడ్ గా వర్క్ చేయించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న పెట్ట డిసెంబర్ కి అన్ని పనులను పూర్తి చేసుకోనుంది. 

అయితే 2.0 నవంబర్ 29న వస్తుండడంతో సినిమాను జనవరికి రిలీజ్ చేయనున్నారు. అయితే డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఫ్యాన్స్ కు పెట్ట టీజర్ తో ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కళానిథి మారన్ నిర్మించిన  పెట్ట సినిమాలో త్రిష - విజయ్ సేతుపతి అలాగే సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.