MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Raj B Shetty: ఆరేళ్లు ప్రేమించాక హ్యాండిచ్చిన అమ్మాయి.. రాజ్‌ బి శెట్టిని మార్చేసిన బ్రేకప్‌ లవ్‌ స్టోరీ

Raj B Shetty: ఆరేళ్లు ప్రేమించాక హ్యాండిచ్చిన అమ్మాయి.. రాజ్‌ బి శెట్టిని మార్చేసిన బ్రేకప్‌ లవ్‌ స్టోరీ

Raj B Shetty: నటుడు రాజ్ బి. శెట్టి 'భర్జరి బ్యాచిలర్స్' షోలో తన ప్రేమ వైఫల్యం గురించి మాట్లాడారు. ఆరేళ్ల బంధం ఎలా ముగిసిపోయిందో, ఆ బ్రేకప్ తనను ఎలా మంచి వ్యక్తిగా మార్చిందో ఆయన బయటపెట్టారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 20 2026, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సు ఫ్రం సో తో పాపులర్‌ అయిన రాజ్‌ బి శెట్టి
Image Credit : the south first

సు ఫ్రం సో తో పాపులర్‌ అయిన రాజ్‌ బి శెట్టి

సు ఫ్రం సో మూవీతో ఒక్కసారిగా ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యాడు దర్శకుడు, నటుడు రాజ్‌ బి శెట్టి. ఇందులో ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. అదే సమయంలో తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి ఎలా హిట్టు కొట్టొచ్చో నిరూపించారు. ఆయన 'ఒండు మొట్టెయ కథె' అయినా, 'సు ఫ్రం సో' అయినా బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యంగా 'సు ఫ్రం సో' ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇది ఆరు కోట్లతో తీస్తే ఏకంగా రూ.125కోట్లు రాబట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లవ్‌ స్టోరీ గురించి రహస్యాలు బయటపెట్టిన రాజ్‌ బి శెట్టి
Image Credit : Lighter Buddha Films, Behindwoods TV

లవ్‌ స్టోరీ గురించి రహస్యాలు బయటపెట్టిన రాజ్‌ బి శెట్టి

కన్నడలో క్రేజీ స్టార్‌గా మారిన రాజ్‌ బి శెట్టి తాజాగా  తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఓపెన్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన తొలిసారిగా తన లవ్ లైఫ్ గురించి ఓ పెద్ద సీక్రెట్ బయటపెట్టారు. తన ప్రేమ వైఫల్యం, దాని నుంచి నేర్చుకున్న పాఠాలు, జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పలు రహస్యాలను వెల్లడించారు.

Related Articles

Related image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Related image2
Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?
36
రాజ్‌ బి శెట్టి ఆరు సంవత్సరాల రిలేషన్​
Image Credit : Asianet News

రాజ్‌ బి శెట్టి ఆరు సంవత్సరాల రిలేషన్​

'భర్జరి బ్యాచిలర్స్' షోలో రాజ్ ఈ విషయాలు చెప్పారు. ఈ వీడియోను namma_kannada_tv ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆయన చెబుతూ, `ఒకమ్మాయి నాతో ఆరేళ్లు ఉంది. ఆ బంధం మొదలయ్యేటప్పుడే నేను చెప్పాను. నువ్వు వెళ్లిపోతానంటే కారణం అడగనని. సరిగ్గా అలాగే జరిగింది. ఆరేళ్ల తర్వాత ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది' అని రాజ్ చెప్పారు.

46
చెడ్డవాడిగానే ఉండిపోయేవాడిని- రాజ్‌ బి శెట్టి
Image Credit : Google

చెడ్డవాడిగానే ఉండిపోయేవాడిని- రాజ్‌ బి శెట్టి

'ఒకవేళ ఆమె నన్ను అప్పుడు వదిలి వెళ్లకపోయుంటే, నేను చెడ్డవాడిగానే మిగిలిపోయేవాడిని అనిపిస్తోంది. నేనేమీ మంచివాడినని కాదు. కానీ బ్రేకప్ అయ్యాక నాకు తెలిసొచ్చింది. నేను ఆమెకు సరిగ్గా ప్రేమను పంచలేదని అర్థమైంది' అని రాజ్‌ బి శెట్టి చెప్పారు. 

56
ఆమె నేర్పిన పాఠం
Image Credit : Facebook

ఆమె నేర్పిన పాఠం

ఆయన ఇంకా చెబుతూ, 'కానీ ఆమె బ్రేకప్ చెప్పడం వల్లే నేను ఎదిగాను. లేదంటే చెడ్డవాడిగానే ఉండిపోయేవాడిని. నువ్వు నాతో ఉండటానికి అర్హుడివి కాదు అనే విషయాన్ని ఆమె నాకు నేర్పింది' అని రాజ్ చెప్పారు.

66
ఇప్పుడు కూడా ఒకరున్నారంటూ భార్యని పరిచయం చేసిన రాజ్‌ బి శెట్టి
Image Credit : Facebook

ఇప్పుడు కూడా ఒకరున్నారంటూ భార్యని పరిచయం చేసిన రాజ్‌ బి శెట్టి

'ఆ తర్వాత మరో అమ్మాయితో బంధం కూడా త్వరగానే ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఒకరున్నారు' అంటూ తన భార్య గురించి రాజ్ మాట్లాడారు. 'ప్రస్తుతం నాతో ఉన్న ఆమెకు జీవితంలో చాలా అన్వేషణ ఉంది. నాకూ అలానే ఉంది. మేమిద్దరం సంతోషంగా ఉన్నాం' అని రాజ్ తెలిపారు. ఆయన చెప్పిన ఈ విషయం ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?
Recommended image2
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Related Stories
Recommended image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Recommended image2
Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved