ఈ కన్నడ సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణం వాటిలోని విషాదాంతమే. ప్రేమలో ఓడిపోవడం వల్లే ఆ చిత్రాలు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
entertainment Mar 20 2026
Author: Aithagoni Raju Image Credits:social media
Telugu
సంజు వెడ్స్ గీత
సంజు వెడ్స్ గీత సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ చిత్రంలో కూడా చివర్లో సంజు, గీత ఇద్దరూ చనిపోతారు. ఈ ఎమోషనల్ ఎండింగ్ సినిమాను సూపర్ హిట్ చేసింది.
Image credits: social media
Telugu
దునియా
దునియా చిత్రంలో కూడా హీరో, హీరోయిన్ ఇద్దరూ చివరికి ప్రాణాలు కోల్పోతారు. ఇది ఒక ట్రాజెడీ సినిమా అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
Image credits: social media
Telugu
అంబారి
చెప్పులు అమ్ముకునే వ్యక్తితో ఓ ధనిక యువతి ప్రేమలో పడి, అతనితో పారిపోతుంది. ఆమె కోరిక మేరకు తాజ్ మహల్ ముందుకు తీసుకెళ్తాడు. కానీ చివరికి అక్కడే హీరో చనిపోతాడు.
Image credits: social media
Telugu
చెలువినా చిత్తార
ఒక మెకానిక్‌ను ప్రేమించిన స్కూల్ అమ్మాయి, అతనితో కలిసి పారిపోతుంది. ఆ తర్వాత వారి జీవితంలో జరిగేవన్నీ విషాదకర సంఘటనలే. కానీ ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.
Image credits: social media
Telugu
ముంగారు మళె
ముంగారు మళె సినిమాలో హీరో, పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్‌ను ప్రేమిస్తాడు. చివరికి తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్టే.
Image credits: social media
Telugu
బంధన
విష్ణువర్ధన్, సుహాసిని, జై జగదీశ్ నటించిన 'బంధన' సినిమాలో విష్ణువర్ధన్ పాత్ర సుహాసినిని ప్రేమిస్తుంది. కానీ ఆ ప్రేమ ఫలించదు. అయినా ఈ సినిమా క్లాసిక్ సూపర్ హిట్‌గా నిలిచింది.
Image credits: social media
Telugu
అమృతధారే
అమృతధారే సినిమా కథ మొత్తం చాలా బాగుంటుంది. ఇందులో లవ్ ఫెయిల్యూర్ ఉండదు. కానీ హీరోయిన్ క్యాన్సర్ బారిన పడి చివరికి చనిపోతుంది. ఈ విషాదాంతం ప్రేక్షకులను కదిలించింది.
Image credits: social media
Telugu
హుచ్చ
కిచ్చా సుదీప్, రేఖ నటించిన 'హుచ్చ' సినిమాలో హీరోయిన్ చనిపోతుంది, హీరో పిచ్చివాడవుతాడు. ఇది తమిళ సినిమా 'సేతు'కు రీమేక్ అయినప్పటికీ, కన్నడలో సూపర్ హిట్ అయ్యింది.