రజనీకాంత్‌ తన అభిమానులకు బెస్ట్ ట్రీట్‌ ఇచ్చారు. తాను నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర టీజర్‌ని దసరా కానుకగా విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్‌ అంశాల మేళవింపుగా సాగే ఈ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులు బెస్ట్ ట్రీట్‌ ఇచ్చాడు. విజయదశమి పండుగ సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తాను నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. శివ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన rajinikanth పాత్ర ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ అదరగొడుతున్నాయి. తాజాగా దసరా కానుకగా గురువారం సాయంత్రం annaatthe teaserని విడుదల చేశారు. 

టీజర్‌ ఆద్యంతం ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగబోతున్నట్టు తెలుస్తుంది. ఊరుపెద్దగా రజనీకాంత్‌ కనిపించబోతున్నట్టు టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ ఏజ్‌లోనూ రజనీ యాక్షన్‌ ఎపిసోడ్స్ అవలీలగా చేయడం అబ్బురపరుస్తుంది. రజనీ మార్క్ స్టయిలీష్‌ ఎపిసోడ్స్, డైలాగులు కట్టిపడేస్తున్నాయి. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రజనీ ఫ్యాన్స్ కిది పర్‌ఫెక్ట్ దసరా ట్రీట్‌ అని చెప్పొచ్చు. 

ప్రస్తుతం `అన్నాత్తే` టీజర్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఫస్ట్ టైమ్‌ శివకుమార్‌ దర్శకత్వంలో రజనీ నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. దీపావలి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు. `దర్బార్` తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తోన్న సినిమా ఇది. `దర్బార్‌` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రం అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని కసిగా ఉన్నారు రజనీ. అందుకు తగ్గట్టుగానే అన్ని అంశాల మేళవింపుగా దీన్ని దర్శకుడు శివకుమార్‌ తెరకెక్కించారు.

also read: సమంత..`మహా` డిజాస్టర్‌ నుంచి తప్పించుకుందట.. రిజక్ట్ చేయడమే ప్లస్‌ అయ్యిందంటోన్న నెటిజన్లు