MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సమంత..`మహా` డిజాస్టర్‌ నుంచి తప్పించుకుందట.. రిజక్ట్ చేయడమే ప్లస్‌ అయ్యిందంటోన్న నెటిజన్లు

సమంత..`మహా` డిజాస్టర్‌ నుంచి తప్పించుకుందట.. రిజక్ట్ చేయడమే ప్లస్‌ అయ్యిందంటోన్న నెటిజన్లు

సమంత ఓవైపు తీవ్ర ఒత్తిడిలో ఉంది. మానసికంగా ఆమె ఇంకా ఫ్రీ కాలేదు. ఇలాంటి టైమ్‌లో సినిమా డిజాస్టర్‌ అయితే.. తట్టుకోవడం మరీ కష్టం. కానీ సమంత తెలివిగా చేసింది. సినిమాకి నో చెప్పడమే బెటర్‌ అయ్యిందట. తాజాగా ఆమె అభిమానులు ఇదే కామెంట్ చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 14 2021, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సమంత(samantha).. నాగచైతన్య(naga chaitanya) విడిపోతున్నట్టు ప్రకటించి అందరిని షాక్ కి గురి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం షాక్‌ అయ్యింది. అత్యంత లవబుల్‌ జోడీగా ఉన్న వీరిద్దరి విడిపోవడం నమ్మలేకపోతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ అదే నిజమని, నమ్మాల్సిందే అంటూ వీరిద్దరి ప్రకటన జరిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
samantha

samantha

ఇలాంటి క్లిష్ణ సమయంలో samantha తీసుకున్న ఓ నిర్ణయం పట్ల ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు. మరి అభిమానులు ప్రశంసించేలా సమంత ఏం చేసింది. అభిమానులు,నెటిజన్ల కామెంట్లకి కారణమేంటనేది చూస్తే.. 

38

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా, అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్‌ జంటలుగా `మహాసముద్రం` చిత్రం రూపొందింది. `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా దసరా కానుకగా నేడు(గురువారం) విడుదలైంది. అయితే maha samudram movie మొదటి షో నుంచే నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. కథలో దమ్ములేదని, దర్శకుడు సరైన విధంగా డీల్‌ చేయలేకపోయాడని, వినోదం పాల్లు మిస్‌ అయ్యాయని, ఇదొక సీరియల్‌ తరహాలో సాగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

48

అయితే ఇందులో అదితి రావు హైదరీ నటించిన `మహా` పాత్ర కోసం దర్శకుడు సమంతని అప్రోచ్‌ అయ్యారు. కానీ సమంత మరో మాట లేకుండా రిజక్ట్ చేసింది. ఆమె రిజక్ట్ చేయడానికి కారణాలేమైనా కావచ్చు కానీ, చేయకపోవడం వల్ల మంచి జరిగిందని అంటున్నారు ఆమె అభిమానులు. లేకపోతే ఇప్పటికే మానసికంగా కుంగుబాటులో ఉన్న సమంతకి మరో దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని, దాన్నుంచి బయటపడినట్టయ్యిందని అంటున్నారు నెటిజన్లు. 
 

58
Aditi Rao Hydari

Aditi Rao Hydari

ఇక మహా పాత్రలో aditi బాగానే చేసిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ పాత్ర మాత్రం ఆద్యంతం ఎమోషనల్‌గా, కన్నీటి వ్యథలాగా సాగుతుందని, ఆ పాత్రకి బిడ్డ ఉండటం లాంటి క్లిష్టమైన అంశాలు ఆడియెన్స్ రిసీవ్‌ చేసుకోలేని విధంగా ఉన్నాయంటున్నారు. అందుకే సమంత రిజక్ట్ చేయడం ఆమెకి ప్లస్సే అయ్యిందంటున్నారు. 

68

సమంత చాలా రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఆమె తాజాగా ఎన్టీఆర్‌ హోస్ట్ గా ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` షోలో గెస్ట్ గా సందడి చేయబోతుంది. సమంత పాల్గొన్న ఈ ఎపిసోడ్‌ గురువారం సాయంత్రి జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. ఈ షో కోసం సర్వత్రా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇందులో సమంత తమ విడాకుల గురించి, చైతూ గురించి ఏం చెప్పబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ఆమె 25 లక్షలు గెలుచుకున్నట్టు తెలుస్తుంది.
 

78

ఇక కెరీర్‌ పరంగా చూస్తే సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` అనే చిత్రంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. 

88

సమంత, నాగచైతన్య ఏడేళ్ల ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితం ఈ అక్టోబర్‌ 2తో ముగిసింది. గాంధీ జయంతి రోజు తాము స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు సమంత, చైతూ అధికారికంగా ప్రకటించారు. కరెక్ట్ గా నాలుగేళ్లకే విడిపోవడం పట్ల వీరి డైవర్స్ మ్యాటర్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved