డైహార్ట్  ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్..  జైలర్ నుంచి సాలిడ్ అప్ డేట్ వచ్చింది. తమన్నాతో పాటు.. సూపర్ స్టార్ అదిరిపోయే స్టెప్పులతో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్న సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈసినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాలో రజనీకాంత్ జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా నటించింది. ఇక ఈసినమా నుంచి వరుసగా అప్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు టీమ్.. ఇప్పటికే ఈమూవీ నుంచి మేకర్స్‌ రిలీజ్ చేసిన తమన్నా లుక్‌ వైరల్ అవుతుండగా.. తాజాగా జైలర్ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

ఇక పాటలో పాత తమన్నా కనిపించింది. హాట్‌ హాట్‌ గుటప్పులో.. తన స్టెప్పులతో మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో షేక్ చేసింది. అటు రజనీకాంత్ కూడా ఈ ఏజ్ లో నవయువకుడిలా.. తమ్ముతో కలిసి సందడి చేశాడు. తమన్నాతో తలైవా కూడా స్టైలిష్‌ స్టెప్పులేసి అదరగొట్టబోతున్నాడు. లిరికల్ వీడియో సాంగ్‌ చూస్తేనే ఇలా ఉంటే.. రియల్ సాంగ్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఇక ఈసాంగ్ రిలీజ్ అయిన క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ప్రస్తుతం వ్యూస్ తో దూసుకుపోతోంది. 

YouTube video player

ఇక రజనీకాంత్ జైలర్‌ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, సునీల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుర్‌, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జైలర్‌ నుంచి మేకర్స్‌ విడుదల చేసిన మోహన్‌ లాల్‌, సునీల్‌, తమన్నా లుక్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.