సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శంకర ల కాంబినేషన్ లో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా '2.0'. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. 'రోబో' సినిమా సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన '2.0'పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. భారీబడ్జెట్‌తో తెరకెక్కించిన 2.0 భారీ నష్టాలు మిగిల్చింది. అయితే ఈ మధ్య ఇండియన్ సినిమాలకు చైనా మార్కెట్ అనేది బూస్టింగ్ గా నిలుస్తుంది. సినిమా గనుక వాళ్లకి నచ్చితే వందల కోట్ల వసూళ్లు అక్కడ కలెక్ట్ చేయడం ఖాయం.

అందుకే 2.0 టీమ్ చైనా రిలీజ్ పై చాలా నమ్మకం పెట్టుకుంది. కానీ ఈ సినిమా అక్కడ కూడా సినిమా ప్లాప్‌గానే మిగిలిపోయింది. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ పెద్దగా లేవు. కనీసం వీకెండ్ లోనైనా పుంజుకుంటుందేమో అనుకున్నారు. కానీ వీకెండ్ కూడా కలెక్షన్స్ లేకపోవడంతో సినిమాని ఫ్లాప్ గా తేల్చేశారు.

మాములుగా అయితే ఇలాంటి సినిమాలకు చైనాలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది కానీ '2.0'కి కనీసపు కలెక్షన్స్ లేకపోవడంతో అక్కడ కూడా సినిమా నష్టాలనే మిగిల్చింది. గతంలో 'బాహుబలి' సినిమాకూడా చైనాలో రిలీజై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సౌత్ ఇండియన్ సినిమాలు చైనాలో ఎందుకు ఆడడం లేదో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.