సూపర్‌స్టార్  రజనీకాంత్ సినిమాలకి కేవలం తమిళంలోనే కాదు..తెలుగులోనూ మంచి మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రజనీకాంత్-శంకర్ కలయికలో రూపొంది రిలీజైన  2.0. చిత్రం సైతం తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజై మంచి హిట్ అయ్యింది.  ఇక ఈ సినిమా సెట్ పై ఉండగానే రజనీ మరో చిత్రాన్ని అంగీకరించారు. వినూత్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

పేట్ట టైటిల్ తో రూపొందుతున్న  ఈ చిత్రం తెలుగు రైట్స్ ని నిర్మాత సి.కళ్యాణ్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే సి కళ్యాణ్ వెంటనే ఖండించారు. ఈ నేఫధ్యంలో అసలు ఎవరు తెలుగులో రైట్స్ తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేఫధ్యంలో ...తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాత వల్లభనేని అశోక్   ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, తనే అని కన్ఫర్మ్ చేసారు.  ఈ నేఫధ్యంలో ఆయన ఎంత రేటు పెట్టి రైట్స్ తీసుకున్నరనే విషయం ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం ప్రకారం ఇరవై కోట్లవరకూ ఈ సినిమా రైట్స్ కోసం అశోక్ ముందుకు వచ్చినట్లు సమాచారం. నిజానికి ఈ రేటు చాలా ఎక్కువని ట్రేడ్ లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఈ ఇరవై కోట్లలో కలిపి  ఇవ్వటం లేదు. కేవలం ఆంధ్రా,తెలంగాణాలో జరిగే బిజినెస్ ,కలెక్షన్స్ లోనే ఈ డబ్బులు రికవరీ అవ్వాలి. సర్కార్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న అశోక్ ఈ సినిమాపైనా బాగా నమ్మకంగా ఉన్నారు. 

సర్కార్, నవాబ్ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన   నిర్మాత, పంపిణీదారు వల్లభనేని అశోక్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `పెట్టా` చిత్రాన్ని `పేట` పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది.

నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ “సూపర్ స్టార్ రజినీకాంత్ రొరింగ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా తెరకెక్కిన ష‌`పేట` చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు సంతోషంగా ఉంది.చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ రజినీకాంత్ కు వీరాభిమాని.అందుకే రజినీకాంత్ ను అయన తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి ఎక్స్ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు.

అలాగే ఈ చిత్రం లో ప్రతి ఒక్కరిపాత్రలు ఆకట్టుకుంటాయి.అటు మాస్ ఆడియెన్స్ ను ,ఇటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్నమంచి చిత్రమిది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నాం` అన్నారు. 

రజనీ నటిస్తున్న 165వ చిత్రమిది.   త్రిష, సిమ్రాన్  హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్, నిర్మాత: వల్లభనేని అశోక్.