సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండదు. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా తలైవా స్టైల్ గురించి మాట్లాడకుండా ఉండని హీరోలు ఉండరు. స్టార్ హీరోలకే ఆదర్శంగా నిలిచిన సూపర్ స్టార్ అభిమానుల గుండెల్లో ఎంత బలంగా పాతుకుపోయి ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

తమిళ్ తరువాత తెలుగులో కూడా రజినీకాంత్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే చాలా ఏళ్ల తరువాత రజినీకాంత్ క్రేజ్ తెలుగులో తగ్గినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే పేట్ట సినిమా విడుదల విషయంలో ఒక క్లారిటీ లేకపోవడం అనుకున్నంత బజ్ లేకపోవడంతో సినిమాపై ఏ మాత్రం అంచనాలు లేవు. రజినీకాంత్ గత సినిమాల వైఫల్యమే అందుకు కారణమని చెప్పవచ్చు. 

కబాలి - కాలా ఇటీవల వచ్చిన 2.0 తెలుగు ఆడియెన్స్ ని అంతగా మెప్పించలేకయాయి. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పేట్ట సినిమాపై పడింది. బయ్యర్లు కూడా రజినీకాంత్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పుడు పేట్ట సంక్రాంతి బరిలో ఎంతవరకు హిట్ అందుకుంటుందో చెప్పడం కష్టమే.  

బాబా సినిమా తరువాత రజిని ప్రతి సినిమా తమిళ్ తో పాటే తెలుగులో కూడా ఒకే రోజు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ప్రతి సినిమాకు రెండు భాషల్లో రిలీజ్ హంగామా కనిపించేది. కానీ ఈ సారి పేట్ట విషయంలో మాత్రం అందుకు విభిన్నంగా జరుగుతుండడంతో రజినీ కాంత్ మార్కెట్ పై అనుమానాలు వస్తున్నాయి. మరి రజిని సినిమాలు చేయడంలో చూపిస్తున్న స్పీడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంలో చూపిస్తారా లేదా అనేది తెలియాలి అంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.