రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన 'బేవర్స్' సినిమా ఆడియో ఫంక్షన్ ఇటీవలే జరిగింది. ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రేమ వివాహం చేసుకొని ఇంటి నుండి వెళ్లిపోయిన తన కూతురిని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు.

దీనికి సంబంధించి రాజేంద్రప్రసాద్ ని ''మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని, అది తట్టుకోలేక మీరు ఎమోషనల్ అయి మాట్లాడారని అందరూ అనుకుంటున్నారు. అది నిజమేనా..?'' అని ప్రశ్నించగా దానికి ఆయన ''మీరు చెప్పినట్లుగా అయితే నా కూతురు ఎక్కడికో వెళ్లి ఉండాలి కదా.. కానీ తను నాకు దగ్గరలోనే ఇక్కడే ఉంటోంది.

'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఫంక్షన్ కి కూడా నా కూతురు, అల్లుడితోనే వెళ్లాను. నా సినిమా జీవితమంతా అవుట్ డోర్ షూటింగ్స్ తోనే గడిచిపోయింది. నా పిల్లలు, వారి చదువులు  గురించి పట్టించుకునే టైమ్ ఉండేది కాదు. అంతా మా ఆవిడే చూసుకునేది. అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్ కి వచ్చి ఇంట్లో పరిస్థితుల గురించి చెప్పేది.

నేను పిల్లలతో ఎక్కువ సమయం గడపలేదు అది నిజమే.. కానీ వారు చక్కగా చదువుకున్నారు. క్రమశిక్షణతో పెరిగారు. నా కూతురు గాయత్రి న్యూట్రిషన్ అండ్ డైటీషియన్‌ కోర్స్ చేసింది. తనకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకొని ఇప్పుడు సంతోషంగా గడుపుతోంది'' అంటూ చెప్పుకొచ్చాడు.  

సంబంధిత వార్త.. 

లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయిన కూతురి కోసం ఏడ్చాను: రాజేంద్రప్రసాద్