మోడల్ రాజీవ్ సేన్, తన భార్య చారు అసోపతో విడిపోతున్నట్లు కొన్నాళ్లుగా వరుస కథనాలు రావడం జరిగింది. వీరిద్దరి వైవాహిక జీవితం సరిగా సాగడం లేదని, అందుకే విడాకులు సిద్ధం అవుతున్నారని బి టౌన్ లో గట్టిగా వినిపించింది. దానికి కారణం రాజీవ్ సేన్ మరియు చారు సోషల్ మీడియాలో తమ అకౌంట్స్ నుండి తాము కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసేశారు. అలాగే ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం జరిగింది. దీనితో ఇకపై వీరు కలిస్ ఉండడం కష్టమే అని ఒక నిర్ధారణకు అందరూ వచ్చారు. 

ఈ రూమర్లకు రాజీవ్ సేన్, చారు అసోప చెక్ పెట్టారు.  సోషల్ మీడియాలో వీరు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియజేశారు. రాజీవ్ సేన్ 'కలిసి ఉండడం ఎంతో ఆనందం కలిగిస్తుంది. నాభార్యను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అని పోస్ట్ పెట్టారు. దీనికి ప్రతిగా చారు అసోప 'నిన్ను బాగా మిస్ అవుతున్నానను' అని ఓ రొమాంటిక్ ఫోటో పోస్ట్ చేసింది. తాజా సోషల్ మీడియా పోస్టులు ద్వారా రాజీవ్, చారు విడిపోనున్నారనే వార్తలకు చెక్ పడింది. 

గత ఏడాది రాజీవ్, చారు అపోస గోవాలో ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి కేవలం సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. రాజీవ్ మాజీ మిస్ వరల్డ్ సుస్మిత సేన్ సోదరుడు. ఇక బుల్లితెర నటి అయిన చారు రెండు హిందీ చిత్రాలలో కూడా నటించారు.