టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. ఎంతమంది యాంకర్లు వచ్చినా.. సుమ క్రేజ్ ని మాత్రం ఎవరూ తగ్గించలేకపొతున్నారు. రీసెంట్ గా 'మహర్షి' సక్సెస్ మీట్ లో మహేష్ సైతం సుమకి స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంటే ఆమె క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతగా ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈమెకి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని.. ఒక్కోసారి హీరోయిన్లకు మించి సంపాదిస్తుందని వార్తలు వచ్చాయి. 

అయితే ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కి సుమకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. సుమకి ఉన్న టాలెంట్, ఆమె పనితనమే తనను టాప్ ప్లేస్ లో ఉంచిందని, అందులో క్రెడిట్ మాత్రం తను తీసుకోనని అంటున్నారు రాజీవ్.

సుమ వరుస షోలు, కార్యక్రమాల్లో  కనిపిస్తుంది కాబట్టి ఆమె చాలా సంపాదించేస్తుందని అందరూ అనుకుంటున్నారని.. కానీ దాని వెనుక చాలా కష్టం కూడా ఉందని అన్నారు. సినిమా షూటింగ్ లో లైట్ల మధ్య ఐదు నిమిషాలు నిల్చొని ఒక షాట్ చేయడమంటే చాలా కష్టమని అలాంటిది సుమ రోజుకి కొన్ని వందల లైట్ల మధ్య ఎనిమిది, తొమ్మిది గంటలు నిల్చొని షోలు చేస్తుంటుందని.. ఇన్నేళ్లుగా ఆ కష్టాన్ని భరిస్తూ పని చేసుకుంటూ వస్తోందని అన్నారు.

అయితే బయట అందరూ అనుకుంటున్నట్లు ఓహో అనేంత రేంజ్ లో రెమ్యునరేషన్ ఉండదని అన్నారు. సుమ ఎంత సంపాదిస్తోందనే విషయాలను తను ఎప్పుడూ తెలుసుకోవాలని ప్రయత్నించలేదని, ఆమెకి ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తానని అన్నారు. నిజంగా సుమ రెమ్యునరేషన్ ఎంతో తనకు తెలియదని అన్నారు. 

మహేష్ బాబు కెరీర్ బాక్స్ ఆఫీస్ హిట్స్.. లాభ నష్టాలు