దివంగత సినీ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాజ్ దూత్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అర్జున్ గున్నాల, కార్తిక్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

సినిమాలో ఒక వ్యక్తి రాజ్ దూత్ బైక్ కోసం వెతుకుతుంటాడు. ఆ బైక్ ని తీసుకురావడానికి మేఘాంష్ బయలుదేరతాడు. అలా బైక్ కోసం తన స్నేహితులతో కలిసి వెతుకుతుంటాడు.

ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నక్షత్ర అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ ని బట్టి సినిమా మొత్తం బైక్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బైక్ స్టోరీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!