రాజశేఖర్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తనకు మరియు కుటుంబానికి కరోనా సోకినట్లు తెలియజేశారు. భార్య జీవితా మరియు కూతుళ్లు శివాని, శివాత్మికలు కూడా కరోనా బారిన పడ్డట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిల పరిస్థితి చాలా మెరుగ్గా  ఉందన్న రాజశేఖర్...హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు. 

రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కాసేపటి క్రితం చేసిన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. నాన్న కోవిడ్ తో పోరాడుతున్నారు. ఆయన కోలుకోవడానికి మీరు ప్రార్ధనలు చేయాలని ఫ్యాన్స్ ని వేడుకున్నారు. ఐతే మరో ట్వీట్ లో శివాత్మిక నాన్న ఆరోగ్యం విషమంగా లేదు...కోలుకుంటున్నారు. నా ట్వీట్ అపార్థం చేసుకోవద్దని వివరణ ఇచ్చారు. 

శివాత్మిక ట్వీట్ నేపథ్యంలో నెటిజెన్స్ స్పందించారు. యాంగ్రీ యుంగ్ మెన్ రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్  చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. ఇక గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కల్కి మూవీ చేయడం జరిగింది. త్వరలో ఆయన తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాల్సివుంది. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కోవిడ్ బారినపడ్డారు.