యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. రీఎంట్రీ తర్వాత రాజశేఖర్ విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో గరుడవేగ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ కూడా పర్వాలేదనిపించింది.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. రీఎంట్రీ తర్వాత రాజశేఖర్ విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో గరుడవేగ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ కూడా పర్వాలేదనిపించింది. గరుడ వేగ లో రాజశేఖర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా నటించారు. కల్కిలో పోలీస్ గా నటించారు. మరోసారి శేఖర్ మూవీలో కూడా ఆయన పోలీస్ అధికారిగానే నటిస్తున్నారు. కాకపోతే చిన్న చేంజ్.. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా తన జాబ్ కి రాజశేఖర్ రాజీనామా చేస్తారు.
ఎందుకు రిజైన్ చేశారు అనేది కథలో భాగం. తాజాగా శేఖర్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. 'పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా డ్యూటీ చేయనివాళ్ళు చాలా మంది ఉన్నారు.. అదే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా డ్యూటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు వేలల్లో ఒకరు మాత్రమే ఉంటారు' అంటూ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
రాజశేఖర్ గడ్డం లుక్ లో ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కుమార్తె రియల్ లైఫ్ డాటర్ శివాని నటిస్తోంది. రాజశేఖర్ తన భార్యతో విడిపోవడం.. ఆమెకు యాక్సిడెంట్ కావడం లాంటి అంశాలు ట్రైలర్ లో చూపించారు. ఇవే కథకు కీలకం కానున్నాయి.
ఇందుకు జరిగింది యాక్సిడెంట్ కాదని.. ఇంకేదో ఉందని తన ఇన్వెస్టిగేషన్ తో రాజశేఖర్ ఉత్కంఠ పెంచేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే.. ఈ యాక్సిడెంట్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేధించే విధానం హైలైట్ కాబోతున్నట్లు అర్థం అవుతోంది.
మొత్తంగా రాజశేఖర్ మరో థ్రిల్లర్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత దర్శకత్వం వహించడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

