Asianet News TeluguAsianet News Telugu

బిగ్ సర్ప్రైజ్.. నితిన్ మూవీలో యాంగ్రీ హీరో రాజశేఖర్..

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

Rajasekhar to play important role in Nithiin movie dtr
Author
First Published Oct 12, 2023, 4:26 PM IST

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు. 

రచయితగా లెన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన వక్కంతం వంశి దర్శకుడిగా తొలి ప్రయత్నంలో తడబడ్డారు. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీనితో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని వక్కంతం వంశి ప్లాన్ చేస్తున్నారు. 

ఈ చిత్రం ముందుగా డిసెంబర్ 22న రిలిజ్ కి రెడీ అయింది. అయితే ఆ తేదీలో ప్రభాస్ సలార్ వస్తుండడంతో నితిన్ చిత్రం ప్రీపోన్ అయింది. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ కీలకమైన స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. 

రాజశేఖర్ సన్నివేశాలని షూట్ చేసేందుకు ప్రస్తుతం వర్క్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ ఇటీవల నెమ్మదిగా చిత్రాలు చేస్తున్నారు. దీనితో రాజశేఖర్ కి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఒక కొత్త ఇమేజ్ ఇస్తుందని భావిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్  బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios