సీనియర్ నటుడు రాజశేఖర్ 'గరుడవేగ' చిత్రంతో సక్సెస్ అందుకొని తన సత్తా చాటాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకి లాభాలు మాత్రం రాలేదని టాక్. రాజశేఖర్ మార్కెట్ కి మించి రెండు రెట్లు ఎక్కువగా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టారు.

ఆ కారణంగానే సినిమా హిట్ అయినా.. సరైన లాభాలను మాత్రం అందుకోలేదు. ఇప్పుడు అతడి కొత్త సినిమా విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'అ!' మూవీ ఫేం దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రాజశేఖర్ హీరోగా 'కల్కి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ కథ కోసం భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నట్లు తెలుద్తోంది.

సినిమా షూటింగ్ కోసం ఒక సెట్ ని ఏర్పాటు చేశారట. ఆ సెట్ కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ ని తగ్గించడం కోసం ఇప్పుడు హీరోయిన్ల దగ్గర రాజీ పడినట్లు స్పష్టమవుతోంది. ఫామ్ లో లేని, ఫేడవుట్ అయిపోయిన అదాశర్మ, నందితశ్వేతా వంటి తారలను తీసుకొచ్చారు. 

బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన స్కార్లెట్ విల్సన్ కూడా కనిపించబోతుంది. బాహుబలి తప్ప ఆమెకి గుర్తింపు తెచ్చిన మరో సినిమా లేదు. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర అంతంతమాత్రంగానే ఉంటుందని సమాచారం. రూ.15 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను రూపొందిస్తే.. సినిమా సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!