గరుడవేగ సినిమా సక్సెస్ జీవిత రాజశేఖర్ జీవితాల్లో వెలుగు నింపిందని.. దాంతో ఇక ఆ ఫ్యామిలీకి కోట్లు వచ్చేస్తున్నాయి, రాజకీయాల్లో కూడా కీలకం అయిపోతారని.. ఓ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అసలు విషయం మాత్రం మరోలా వుండటం సంచలనం రేపుతోంది.

 

గరుడవేగ సినిమా విడుదలతో ఈ ఫ్యామిలీ చిక్కులేమీ తొలగిపోలేదు. ఈ సినిమా సక్సెస్ అయినా జీవితకు మరిన్ని ఫైనాన్స్ చిక్కులు చుట్టుముడుతున్నాయి. ఎందుకంటే గరుడవేగ కోసం చేసిన అప్పులు చాలా వరకు అలాగే వున్నాయి. విడుదలకు ముందు రోజు రాత్రి మూడుకోట్ల అప్పుకు కోటి బాకీ తీర్చి, రెండు కోట్లకు ఫ్లాట్ గ్యారంటీ పెట్టి సేల్ డీడ్ రాశారు.

 

ఏదో ప్రాపర్టీ తాకట్టు పెట్టారులే.. తిరిగి సక్సెస్ వచ్చాక తీసేసుకోవచ్చను అనుకుంటే.. ఇబ్బందులు లేకుండా సినిమా రిలీజ్ కావాలన్న బలమైన కోరిక తొందరపెట్టడంతో.. ఫ్లాట్ మాత్రమేకాక, దానికి తోడు వరల్డ్ డిజిటల్ రైట్స్, రీమేక్ రైట్స్ అన్నీ సదరు ఫైనాన్షియర్ కు హామీగా రాసి ఇచ్చారట. దీంతో అసలు చిక్కుల్లో ఇరుక్కున్నారని తెలుస్తోంది.

 

ఎందుకంటే.. అలా అన్నీ రైట్స్ రాసిచ్చేసి.. ఇప్పుడు జీవితనే ఒకరికి తెలియకుండా మరొకరికి ఇద్దరికి గరుడవేగ హిందీ డిజిటల్ హక్కులు విక్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గరుడవేగ నిర్మాత ఆ రైట్స్ వేరే వాళ్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే ఆ విధంగా ముగ్గురుకి హక్కులు వెళ్లాయి. అసలు హక్కులు ఫైనాన్స్ ఇచ్చిన వారి దగ్గర వున్నాయి. మొత్తం 5 కోట్లదాకా హక్కుల కోసం వచ్చాయి. అయితే అవి ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఒకరికి తెలియకుండా ఒకరు రైట్స్ అమ్ముకోవడడంతో  తంటాలు వచ్చి పడ్డాయి.

 

సినిమా హిందీ రైట్స్ కొన్న వారిలో ఓ వ్యక్తి ఇప్పటికే పేపర్ నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హక్కుల విషయంలో.. ముడిపడ్డవారు ముగ్గురు ఓసారి సమావేశమై ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. మరో పక్క ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి కూడా.. రైట్స్ విషయంలో పేపర్ నోటీస్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా సక్సెస్ అయిందన్న ఆనందం కంటే... సక్సెస్ కోసం చేసిన చిన్నచిన్న పొరపాట్లు జీవిత రాజశేఖర్ లను చిక్కుల్లో పడేసాయి.