దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల 'RRR' సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లారు. ఆయన సడెన్ గా అమెరికా వెళ్లడంతో తానా సభల కోసమనే అనుకున్నారు.

పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది సెలబ్రిటీలు తానా సభలకు హాజరు కావడం, రాజమౌళి అన్నయ్య కీరవాణి మ్యూజిక్ నైట్ ఉండడంతో రాజమౌళికి స్పెషల్ ఇన్విటేషన్ అంది ఉంటుందని ఆ కారణంగానే ఆయన అమెరికా వెళ్లారని భావించారు. 

అయితే అందులో నిజం లేదని వ్యక్తిగత కారణాల వలన అమెరికా వచ్చానే తప్ప తానా సభల కోసం కాదని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన అమెరికా ఎందుకు వెళ్లారని వాకబు చేయగా.. తన అన్నయ్య కీరవాణి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేయడం కోసం వెళ్లినట్లు తెలిసింది.

జూన్ 4న కీరవాణి పుట్టినరోజు సందర్భంగా.. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా అమెరికా వెళ్లి కీరవాణితో కేక్ కట్ చేయించడంతో పాటు గ్రాండ్ పార్టీ కూడా ఆర్గనైజ్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా ప్రయాణంలో కీరవాణి పాత్ర ఎంతో కీలకం. దాదాపు రాజమౌళి రూపొందించే అన్ని చిత్రాలకు కీరవాణినే సంగీత దర్శకుడిగా పని చేస్తుంటారు.