Asianet News TeluguAsianet News Telugu

తన హీరో కోసం ఏఎంబి సినిమాస్ లో రాజమౌళి.. కీరవాణితో కలసి గుంటూరు కారం మూవీ చూస్తూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతి బరిలోకి దిగి పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు.

Rajamouli watched guntur kaaram movie at amb cinemas dtr
Author
First Published Jan 21, 2024, 5:05 PM IST | Last Updated Jan 21, 2024, 5:05 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతి బరిలోకి దిగి పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించినప్పటికీ పర్వాలేదనిపించే వసూళ్లు రాబట్టింది. 

దీనితో ఇప్పుడు మహేష్ అభిమానుల చూపంతా రాజమౌళి మూవీపైనే ఉంది. ఆల్రెడీ జక్కన్న ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ మొదలు పెట్టేశారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్ ఈ చిత్రం కోసం పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ లో రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయి మూవీగా తెరకెక్కించబోతున్నట్లు టాక్. 

అయితే రాజమౌళి థియేటర్ కి వచ్చి సినిమాలు చూడడం చాలా అరుదు. తాజాగా రాజమౌళి తన హీరో మహేష్ బాబు కోసం ఏఎంబి సినిమాస్ లో గుంటూరు కారం చిత్రాన్ని వీక్షించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి నిలబడుకుని ఉండగా.. కీరవాణి సీట్ లో కూర్చుని మూవీ చూస్తున్నారు. 

అయితే కీరవాణి కూర్చున్న విధానం చూస్తుంటే ఆయన నిద్రపోతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం చిత్రం ఇప్పటి వరకు 200 కోట్ల పైగా గ్రాస్ వాసులు చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. 

ఏది ఏమైనా గుంటూరు కారం హంగామా ముగిసినట్లే. ఇక మహేష్ బాబు.. రాజమౌళి చిత్రంతో కొన్నేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండడం ఖాయం. అయితే ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios