`పఠాన్‌` మూవీతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యంది దీపికా పదుకొనె. ఈ దెబ్బతో ఇప్పుడు మరో జాక్‌ పాట్‌ కొట్టేసిందట. రాజమౌళి మూవీలో ఫైనల్‌ అయ్యిందని సమాచారం. 

దీపికా పదుకొనె సక్సెస్‌ జోరు మామూలుగా లేదు. ఆమె `పఠాన్‌`తో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ఓ వైపు ఈ సినిమా బాలీవుడ్‌కి కొత్త ఊపిరిపోస్తే, షారూఖ్‌ కి పూర్వవైభవాన్ని, ఇంకా చెప్పాలంటే తిరుగులేని సూపర్‌ స్టార్‌ని, పాన్‌ ఇండియా స్టార్‌ని చేసింది. ఈ సినిమా దీపికా పదుకొనెని సైతం పాన్‌ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఇప్పటికే దీపికా తెలుగులో ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుంది. ఇది పాన్‌ ఇండియా మూవీనే కాదు, `పఠాన్‌` తెచ్చిన ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. 

ఈ సినిమా ఇప్పుడు దీపికాకి సరికొత్త ఇమేజ్‌ని తీసుకువచ్చింది. అంతేకాదు కొత్త అవకాశాలను తీసుకొచ్చింది. తాజాగా మహేష్‌తో కలిసి నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇది రాజమౌళి మూవీలో కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ ఓ ఇంటర్నేషనల్‌ రేంజ్‌ మూవీ చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా దీపికా పడుకొనెని తీసుకోవాలనుకుంటున్నారు.

అయితే గతంలోనే మహేష్‌కి జోడీగా దీపికాతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. తాజాగా ఫైనల్‌ అయ్యిందని టాక్. ఇటీవల దీపికా నటించిన `పఠాన్‌` భారీ బ్లాక్‌ బస్టర్‌ కావడం, ఇందులో యాక్షన్‌తో దీపికా అదరగొట్టడంతో జక్కన్న ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. దీపికానే ప్రత్యేకంగా తీసుకోవాలనుకోవడానికి కారణం లేకపోలేదు. 

మహేష్‌ మూవీలో హీరోయిన్‌ పాత్రలోనూ కొంత యాక్షన్‌ సీక్వెన్స్ ఉంటాయని, దీపికా అయితే బాగా సెట్‌ అవుతుందని, పైగా మహేష్‌కి కరెక్ట్ సెట్ అవుతుందని, పాన్‌ ఇండియా ఇమేజ్‌ తోడవుతుందని జక్కన్న భావిస్తున్నట్టు సమాచారం. వీరితోపాటు ఈ సినిమాలో అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇతర భాషలకు చెందిన కాస్టింగ్‌ని ఎంపిక చేస్తున్నారు రాజమౌళి. ప్రపంచ మార్కెట్‌ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మహేష్‌ మూవీని రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నాడు రాజమౌళి. మరి ఇది ఏ రేంజ్‌ మూవీ అవుతుందో చూడాలి.