మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ పోటీ పడి మరీ నటించారు. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. కొమరం భీమ్ తెలంగాణ పాత్రలో ఆదివాసీలకు అండగా నిలబడిన స్వాతంత్ర యోధుడిగా చరిత్రలో నిలిచిపోయారు. 

కొమరం భీం పేరుతో తెలంగాణ ప్రభుత్వం జిల్లా కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం దర్శకధీరుడు రాజమౌళి కొమరం భీమ్ జిల్లాలో కొమరం భీమ్ స్వస్థలం ఆసిఫాబాద్ ని సందర్శించారు. కొమరం భీం మనవడు సోనేరావు, అసిస్టెంట్ కలెక్టర్ వరుణ్ రెడ్డి రాజమౌళికి ఆహ్వానం పలికారు. 

అసిఫాబాద్ లో ఓ చిన్న థియేటర్ లో అభిమానులతో కలసి రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. కొమరం భీమ్ పాత్రని ఆయన సొంత జిల్లాలో చూడడం అద్భుతమైన ఫీలింగ్ అని రాజమౌళి తెలిపారు. ఈ అవకాశం కల్పించిన అధికారులకు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.