పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ గురించి ట్వీట్ చేశారు యూనివర్సల్ డైరెక్టర్.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?  

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈరోజు (28 జులై) పాన్ ఇండియా మూవి విక్రాంత్ రోణతో తెలుగు ఆడియన్స్ ను కూడాపలకరించాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను ఐదు భాషల్లో నిర్మించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా తన మిత్రుడు సుదీప్ కు.. సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. 

అంతే కాదు సుధీప్ గురించి రాజమౌళి గొప్పగా చెప్పారు. ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. ప్రయోగాలు చేయడంలో, సవాళ్లను స్వీకరించడంలో సుదీప్ ఎప్పుడూ ముందుంటాడు. విక్రాంత్ రోణ సినిమాలో సుదీప్ ఏం చేశాడు, ఎలా చేశాడో చూడటం కోసం నేను ఎదురు చూస్తున్నాను, సినిమా చూడటం కోసం ఆత్రుతగా ఉన్నా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి ప్రమోషన్ వీడియోస్ చూస్తేనే అర్ధమైయ్యింది. కిచ్చా సుదీప్ కు, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు

Scroll to load tweet…

సుధీప్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఎప్పటి నుంచో సుపరిచితమే. రాజమౌళి విజ్యూవల్ వండర్ ఈగ సినిమాతో ఆయన తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.. ఆ సినిమాతోనే టాలీవుడ్ కు బాగా దగ్గరయ్యారు. ఇక బాహుబలి లో కూడా సుదీప్ ఒక కీలక అతిథి పాత్రలో మెరిసిమురిపించాడు. ఈగ సినిమా అప్పటి నుంచే రాజమౌళి, సుదీప్ కు మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. తన స్నేహితుడి సినిమా రిలీజ్ అవ్వడంతో రాజమౌళి ట్విట్టర్ లో స్పందించారు. 

ఈరోజు రిలీజ్ అయిన సుదీప్ విక్రాంత్ రోణ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ముక్యంగా విజ్యూవల్స్, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, కిచ్చా నటనకు మంచి మార్కులు పడుతున్నాయి ఆడియన్స్ నుంచి. భారీ బడ్జెత్ తో పాటు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈసినిమా ప్రమియర్ టాక్ నుంచే పాజిటీవవైబ్స్ మొదలయ్యాయి. మరి సుదీప్ కలెక్షన్స్ విసయంలో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి.