Asianet News TeluguAsianet News Telugu

అజయ్ దేవగన్ కు సాయం చేసిన రాజమౌళి, ఫుల్ హ్యాపీ

ఈ క్రమంలో రాజమౌళి సలహా అడిగారు. దానికి రాజమౌళి...షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో వేసే సెట్స్ లో పెట్టుకోమని చెప్పారు. అంతేకాకుండా తన సినిమాలు పనిచేసే స్టార్ ఆర్ట్ డైరక్టర్ సబు సిరిల్ ని ..అజయ్ దేవగన్ కు హెల్ప్ చేయమని కోరారు. ఆ తర్వాత సబు సిరిల్, అజయ్ దేవగన్ కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఆరు నెలలు పాటు కష్టపడి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేసారు. అవి చూసిన అజయ్ దేవగన్ తన సినిమా సగం పూర్తైనట్లే అని ఫీలయ్యారట. 

Rajamouli turns a helping hand for Ajay Devgn jsp
Author
Hyderabad, First Published Jan 20, 2021, 10:41 AM IST

గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమా హిందీలో 'మక్కీ' పేరుతో డబ్ చేయగా.. ఆ చిత్రానికి అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ అందించారు. అప్పటి నుంచి అజయ్ దేవగన్... రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రాజమౌళి సినిమాలో నటించాలని అజయ్ దేవగన్ అనుకుంటున్నారు. ఫైనల్ గా 'ఆర్.ఆర్.ఆర్' లో ఎంతో కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగణ్ ని తీసుకున్నారు. దాంతో రాజమౌళి, అజయ్ దేవగన్ కు మంచి మిత్రలు అయ్యారు. దాంతో అజయ్ దేవగన్ కు వచ్చిన ఓ సమస్యని రాజమౌళి పరిష్కించారు. అదేమిటంటే...

బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘మే డే’. ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా  అజయ్‌ దేవగణ్‌ పనిచేస్తుండటం విశేషం. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన, బిగ్‌బి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అంగీరా ధార్‌ కథానాయికలు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అజయ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి వేసుకున్న ప్లానింగ్ మొత్తం కరోనా దెబ్బతో అప్ సెట్ అయ్యింది. దాంతో అజయ్ దేవగన్ చాలా టెన్షన్ గా ఉన్నారు. 

ఈ క్రమంలో రాజమౌళి సలహా అడిగారు. దానికి రాజమౌళి...షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో వేసే సెట్స్ లో పెట్టుకోమని చెప్పారు. అంతేకాకుండా తన సినిమాలు పనిచేసే స్టార్ ఆర్ట్ డైరక్టర్ సబు సిరిల్ ని ..అజయ్ దేవగన్ కు హెల్ప్ చేయమని కోరారు. ఆ తర్వాత సబు సిరిల్, అజయ్ దేవగన్ కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఆరు నెలలు పాటు కష్టపడి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేసారు. అవి చూసిన అజయ్ దేవగన్ తన సినిమా సగం పూర్తైనట్లే అని ఫీలయ్యారట. 

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ– ‘‘మే డే’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను శుక్రవారమే మొదలుపెట్టాం. సినిమా పూర్తయ్యేవరకూ నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ చేస్తాం. అమితాబ్‌ గారిని తొలిసారి దర్శకత్వం వహిస్తుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. 2022 ఏప్రిల్‌ 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అసీమ్‌ బజాజ్, సహ నిర్మాతలు: కుమార్‌ మంగత్, విక్రాంత్‌ శర్మ, హస్నైన్‌ హుస్సేనీ, జయ్‌ కనూజియా, సందీప్‌ కెవ్లానీ, తార్‌లోక్‌ సింగ్‌.

Follow Us:
Download App:
  • android
  • ios