బాలీవుడ్ బ్యూటీలను వెదుకుతున్న రాజమౌళి

బాలీవుడ్ బ్యూటీలను వెదుకుతున్న రాజమౌళి

బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ఇటీవల స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు. ఈ విషయాన్ని మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో సాయి ధరం తేజ్ కూడా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమాలో మిగిలిన తారలను ఎంపిక చేసే పనిలో పడ్డాడు రాజమౌళి. ముందుగా హీరోయిన్లను ఎంపిక చేయనున్నాడు. ఒక హీరోయిన్ గా అను ఎమ్మాన్యూయల్ ను తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి పేరు, ప్రఖ్యాతలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు పెరిగింది. దీంతో అతడి తదుపరి చిత్రాలు కూడా ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. చరణ్-ఎన్టీఆర్ ల సినిమాను కూడా అదే ఆలోచనతో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఈ ఇద్దరు హీరోల సరసన బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలని అనుకుంటున్నాడు రాజమౌళి. ఆ విధంగా సినిమాకు హిందీలో మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos